News April 17, 2024
శింగనమల: ఇసుక తవ్వకాలు ఆపండి.. రైతుల ఆవేదన
గార్లదిన్నె మండలం ఇల్లూరు గ్రామ పరిధిలో ఇసుక రవాణా చేస్తున్న వారిని గ్రామస్థులు అడ్డుకొని అక్కడ నుంచి టిప్పర్లు, హిటాచీలను తరలించారు. దయచేసి రైతులకు అన్యాయం చేయకండి.. ఇసుక లేకుంటే భూగర్భ జలాలు అడుగంటిపోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు రైతుల గురించి అలోచించి ఇసుక రీచ్‌లకు అనుమతులివ్వకండి అని అధికారులు కోరుతున్నారు. ఇసుక తవ్వకాలు జరిగే చోటే తాగునీటి బోర్లు ఉన్నాయని తెలిపారు.
Similar News
News September 8, 2024
రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రీషియన్ మృతి
విడపనకల్ మండలం కొట్టాలపల్లి సమీపంలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉరవకొండ మండలానికి చెందిన ఎలక్ట్రీషియన్ చంద్ర అనే వ్యక్తి కొట్టాలపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై నిలబడిన లారీని బైక్‌పై వెళ్తూ ఢీకొన్నాడు. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
News September 8, 2024
గుత్తిలో రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య
గుత్తి జీఆర్‌పీ పరిధిలోని జక్కల చెరువు-రాయల చెరువు రైల్వే స్టేషన్ల మధ్య ఆదివారం ఓ గుర్తుతెలియని వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. జీఆర్‌పీ ఎస్ఐ నాగప్ప సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుని వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News September 8, 2024
లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు రాజీ అయ్యేలా చూడండి: ఎస్పీ
ఈనెల 14వ తేదీ కోర్టులలో జాతీయ మెగా లోక్ అదాలత్ జరుగుతుందని, కక్షిదారులు త్వరితగతిన కేసులు పరిష్కారం కొరకు లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని సత్యసాయి ఎస్పీ రత్న పేర్కొన్నారు. ఆదివారం ఎస్పీ కార్యాలయంలో జిల్లాలోని పోలీస్ అధికారులు, ఎస్సై, కోర్టు కానిస్టేబుల్స్‌తో ఎస్పీ జామ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యేలా చూడాలని ఆదేశించారు.