News April 28, 2024

శిక్షణకు గైర్హాజరైతే కఠిన చర్యలు: కడప కలెక్టర్

image

సాధారణ ఎన్నికలకు సంబంధించి నియమించిన పోలింగ్ సిబ్బంది ఎవరైనా శిక్షణా తరగతులకు గైర్హాజరైతే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ విజయరామరాజు, జనరల్ అబ్జర్వర్ కునాల్ సిల్ కు పేర్కొన్నారు. జిల్లాలోని 2035 పోలింగ్ కేంద్రాలకు ఒక్కో పోలింగ్ కేంద్రానికి ఆరుగురు సిబ్బంది చొప్పున 15% రిజర్వుతో టీంలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులను జారీ చేశామన్నారు. పీఓ, ఏపీఓలకు మే 2, 3 తేదీల్లో శిక్షణ జరుగుతుందన్నారు.

Similar News

News April 16, 2026

కడప ప్రభుత్వ జూనియర్ కాలేజీ టాపర్స్ వీరే..!

image

కడప ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ఫలితాల్లో గ్రూపుల వారీగా టాపర్ల వివరాలు. ఫస్ట్ ఇయర్: MPC – రెడ్డి వెంకట గణేశ్ (450), BIPC – మంజునాథ్(459), CEC – ఉమా శంకర్(473), HEC – నరసింహారావు(438), CSC – చిన్న వర్ధన్(403),
సెకండ్ ఇయర్: MPC – అబ్జల్ భాషా (874), BIPC – హర్షిని (930), CEC – అశోక్ కుమార్ (811), HEC – వీరాంజనేయులు(695), CSC – గంగాధర (843).

News April 16, 2026

మైదుకూరు: ఇంటర్‌లో ఫెయిల్.. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి

image

మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన జి. హరి ఈశ్వర్(18) సమీపంలోని చెరువులో పడి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. మృతుడు ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం విడుదలైన ఫలితాలలో ఫెయిల్ అవ్వడంతో ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అలాగే ఈశ్వర్ తండ్రి మునెయ్య ఆరోగ్య పరిస్థితి సరిగా లేదు.

News April 15, 2026

కడప జిల్లాలో ఇంటర్ ఒకేషనల్ ఫలితాలు ఇలా.!

image

కడప జిల్లాలో ఇంటర్ ఒకేషనల్ పరీక్షలు 2,382 మంది విద్యార్థులు రాశారు. వీరిలో 1,080 మంది పాస్ అయ్యారు.
1st ఇయర్ 592 మంది బాలురు రాయగా.. 285(31%) పాస్ అయ్యారు. 664 మంది బాలికల్లో 278(42%) పాస్ అయ్యారు. 2nd ఇయర్ బాలురు 473 మందిలో 231(49%) పాస్ అయ్యారు. బాలికలు 657 మందిలో 386(58%) పాస్ అయ్యారు. ఒకేషనల్ ఉత్తీర్ణతలో బాలుర కన్నా బాలికలే ముందంజలో ఉన్నారు.