News March 28, 2024
శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్

ఉదయగిరిలోని మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రభుత్వ వ్యవసాయ కళాశాలలో పోలింగ్ అధికారులు, అసిస్టెంట్ పోలింగ్ అధికారులకు ఇస్తున్న ఎన్నికల శిక్షణా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి హరి నారాయణన్ గురువారం పరిశీలించారు. ట్రైనింగ్ కు హాజరు కాని వారిపై చర్యలు తీసుకోవాలని R.O, ARO లకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
Similar News
News December 20, 2025
నెల్లూరు: మాతృవేదన.. తీరేనా.!

నెల్లూరు జిల్లాలో హైరిస్క్ గర్భిణుల మరణాలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. 44,536 మంది గర్భిణుల్లో రక్తహీనత, బీపీ వంటి సమస్యలతో 6,235 మందిని ‘హైరిస్క్’గా గుర్తించారు. వీరిపై నిరంతర పర్యవేక్షణ కొరవడటంతో మరణాలు ఆగడంలేదు. నాలుగేళ్లలో పదుల సంఖ్యలో మరణాలు సంభవించగా.. ఈ ఏడాది ఇప్పటికే నలుగురు మృతి చెందారు. జిల్లాలో మెటర్నల్ మోర్టాలిటీ రేటు 19గా నమోదైంది. వైద్యశాఖ దృష్టిసారిస్తేనే ఈ ముప్పును నివారించగలరు.
News December 20, 2025
నెల్లూరు: వైసీపీలోనే ఆ ముగ్గురు..!

TDPకి షాక్ ఇచ్చిన నలుగురు కార్పోరేటర్లలో ముగ్గురు కార్పొరేటర్లు వైసీపీలోనే కొనసాగనున్నారు. మాజీ మంత్రి అనిల్ ఆధ్వర్యంలో మద్దినేని మస్తానమ్మ, కాయల సాహిత్య, వేనాటి శ్రీకాంత్రెడ్డిలు YS జగన్ను కలిసి వైసీపీ కండువా కప్పుకున్నారు. కాగా శుక్రవారం సిటీ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్రెడ్డిని సిటీ ఆఫీసులో కలిశారు. వైసీపీతోనే తమ పయనం సాగుతుందని TDPలో తమకు ఎటువంటి విలువ లేకుండా పోయిందని తెలిపారు.
News December 20, 2025
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్

ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ హిమాన్షు శుక్ల అధికారులను ఆదేశించారు. నెల్లూరు కలెక్టరేట్లో జరిగి సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు మంచి అవకాశాలు ఉన్నాయన్నారు. నిమ్మ, వేరుశనగ, పాలు, మాంసం జిల్లాలో అత్యధికంగా ఉత్పత్తి అవుతున్నాయని, వీటి నుంచి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను ఏర్పాటు చేసేలా ప్రోత్సహించాలన్నారు.


