News September 11, 2024
శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్ఐలకు హరీశ్‌రావు శుభాకాంక్షలు

బీఆర్ఎస్ ప్రభుత్వం 2022లో 17 వేల పోలీసు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో 547 ఎస్ఐ పోస్టులు ఉండగా, ఆ పోస్టులకు సంబంధించిన శిక్షణ నేటితో పూర్తయింది. తెలంగాణ పోలీసు అకాడమీలో ఇవాళ పాసింగ్ ఔట్ పరేడ్ జరిగింది. ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్ఐలకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News November 17, 2025
మెదక్: శీతాకాలం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి: ఎస్పీ

మెదక్ జిల్లా పరిధిలో శీతాకాలం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ డీవీ.శ్రీనివాస రావు సూచించారు. చలి తీవ్రత ఉదయం, రాత్రి వేళల్లో పొగమంచు పేరుకు పోవడం వల్ల రహదారులపై ముందు ఉన్న వాహనాలు కనిపించక ప్రమాదలు జరిగే ప్రమాదం ఉందన్నారు. ఈ సమయంలో ప్రమాదాలు జరగకుండా అన్ని వాహనదారులు స్పష్టమైన గాజు ఉన్న హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, హై-బీమ్ వాడరాదని, లో-బీమ్ లైట్లు మాత్రమే ఉపయోగించాలని సూచించారు.
News November 17, 2025
మెదక్: సొసైటీ డైరెక్టర్ మృతి

చిన్న శంకరంపేట మండలం జంగారాయి సొసైటీ డైరెక్టర్ సిద్ది రెడ్డి అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సిద్ది రెడ్డి మృతితో గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. మృతి చెందిన సిద్ది రెడ్డి కుటుంబాన్ని సొసైటీ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డితో పాటు డైరెక్టర్‌లు వివిధ పార్టీల రాజకీయ నాయకులు పరామర్శించారు.
News November 17, 2025
నర్సాపూర్: ‘బాల్య వివాహాలపై సమాచారం ఇవ్వండి’

బాల్య వివాహాలను ప్రోత్సహిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని నర్సాపూర్ ఎస్సై రంజిత్ రెడ్డి హెచ్చరించారు. బాల్య వివాహాలపై ఆదివారం నర్సాపూర్‌లో ఫంక్షన్ హాల్ యజమానులు, ఫోటోగ్రాఫర్లు, పురోహితులు, బ్యాండ్ బాజా వారికి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మైనర్ బాలబాలికలకు వివాహాలు జరిగితే అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. వివాహాలు చేసే ముందు వారి వయసు వివరాలను తప్పనిసరిగా సేకరించాలని తెలిపారు.


