News July 6, 2024
శిథిలావస్థకు చేరిన సర్వాయి పాపన్న కోట గోడలు!
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపురంలో సర్ధార్ సర్వాయి పాపన్న నిర్మించిన కోటతో పాటు గోడలు శిథిలావస్థకు చేరి కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయి. శిథిలావస్థకు చేరిన కోటను సంరక్షించేందుకు గతంలో అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేసి వదిలేశారు. ఈ క్రమంలో ఇటీవల కురిసిన వానలకు కోట గోడలు శిథిలమై కూలుతున్నాయి. చరిత్రకు సాక్ష్యంగా ఉన్న కోటకు అధికారులు మరమ్మతులు చేపట్టి సంరక్షించాలని స్థానికులు కోరుతున్నారు.
Similar News
News December 12, 2024
MHBD: వారం కిందటే పెళ్లి నిశ్చయం.. యువకుడి మృతి
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో విషాదం చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ శివారులో కారు చెరువులోకి దూసుకెళ్లిన ఘటనలో నర్సింహులపేటకు చెందిన <<14851197>>విష్ణు(29) మృతి<<>> చెందిన విషయం తెలిసిందే. ఏఈవోగా పని చేస్తున్న విష్ణుకు వారం కిందట ఓ యువతితో వివాహం నిశ్చయమైంది. వచ్చే ఏడాది పెళ్లి చేసేందుకు పెద్దలు నిశ్చయించారు. ఇంతలోనే యువకుడి మృతితో కుటుంబంలో, గ్రామంలో విషాదం నెలకొంది.
News December 12, 2024
పెద్దపులి సంచరిస్తోంది.. అప్రమత్తంగా ఉండాలి: SI
ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని ప్రజలకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. బోధపురం, ఆలుబాక, పెంకవాకు, తిప్పాపురం, సీతారాంపురం, రామచంద్రపురం గ్రామ శివార్లలో పెద్దపులి సంచరించినట్లుగా అటవీ అధికారులు ధ్రువీకరించారని ఎస్ఐ కొప్పుల తిరుపతిరావు తెలిపారు. గ్రామస్థులు వ్యవసాయ పనుల నిమిత్తం, పశువుల మేతకు లేదా ఇతర పనులకు ఒంటరిగా వెళ్లొద్దని సూచించారు.
News December 11, 2024
ఇళ్ల దరఖాస్తుదారుల వివరాలు పకడ్బందీగా సేకరించాలి: మంత్రి పొంగులేటి
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారుల వివరాలు పకడ్బందీగా సేకరించాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయం నుంచి మంత్రి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన ఈ సమీక్షలో జనగాం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పాల్గొన్నారు.