News March 23, 2024
శిల్పారామంలో ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా HYD మాదాపూర్లోని శిల్పారామంలో ఈరోజు బెంగళూరు నుంచి విచ్చేసిన ప్రముఖ భరతనాట్య కళాకారిణి గుణశ్రీ నర్తన గణపతిమ్, రారావేణు, శృంగారలహరి, మరకతమణిమయ అంశాలను ప్రదర్శించి అలరించారు. HYD వాసి సుభాషిణి గిరిధర్ తన శిష్య బృందంచే భరతనాట్య ప్రదర్శనలో గణేశా, కార్తికేయ, నటేశ కౌతం, కాళీ కౌత్వం, నగుమోము, కాలై థూకి, తిల్లాన అంశాలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు.
Similar News
News November 20, 2025
గ్రామాల దేవాలయాలకు సోలార్ భద్రత: చిలుకూరు అర్చకుడు

సీఎస్ఆర్ ద్వారా దేశవ్యాప్తంగా బ్యాంకులు, దేవాలయాల భాగస్వామ్యానికి కొత్త దారిని చూపుతూ చిలుకూరు బాలాజీ దేవాలయం అర్చకుడు రంగరాజన్ ముందడుగు వేశారు. మొయినాబాద్ మండలంలోని పలు గ్రామాల్లోని దేవాలయాల్లో 60 సోలార్ ఆధారిత సీసీ కెమెరాలను అందించారు. వీటిని ఎస్బీఐ, యూబీఐ సంయుక్తంగా అందజేశారు. ఇలాంటి రిమోట్ సర్వైలెన్స్ సొల్యూషన్లను సీఎస్ఆర్కు అనుసంధానించడం దేశంలో ఇదే మొదటిసారి అని అధికారులు పేర్కొ న్నారు.
News November 20, 2025
HYD: బాధితులకు అండగా సైబర్ పోలీసులు

డబ్బు పోగొట్టుకున్న బాధితులకు సైబర్ క్రైం పోలీసులు అండగా నిలిచారు. ఫిర్యాదు స్వీకరించిన మరుక్షణం నుంచే స్పందించి సైబర్ నేరస్థులను అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా వారి నుంచి రూ.63.23 లక్షలు రికవరీ చేసి బాధితులకు అందజేశారు. ఈనెల 12 నుంచి 18వ తేదీ వరకు 18 మంది నిందితులను వివిధ ప్రాంతాల్లో అరెస్టు చేసినట్లు డీసీపీ సాయిశ్రీ తెలిపారు.
News November 20, 2025
HYD: మెట్రోలో వారి కోసం ప్రత్యేక స్కానింగ్

మెట్రోలో భద్రత మా ప్రాధాన్యం అని HYD మెట్రో తెలిపింది. ప్రతి స్టేషన్లో ఆధునిక సీసీటీవీ నిఘా, కఠిన భద్రతా తనిఖీలు అమలు చేస్తూ ప్రయాణికుల రక్షణను మరింత బలపరుస్తున్నట్లు తెలిపింది. ఫేస్మేకర్లు, గుండె రోగులు, గర్భిణీలకు పూర్తిగా సురక్షితమైన స్కానర్లు ఏర్పాటు చేయడం మెట్రో భద్రతా ప్రమాణాలకు నిదర్శనంగా పేర్కొంది.


