News June 27, 2024

శిల్పారామాన్ని సందర్శించిన విదేశీ మీడియా ప్రతినిధుల బృందం

image

మాదాపూర్‌లోని శిల్పారామాన్ని విదేశీ మీడియా ప్రతినిధుల బృందం సందర్శించింది. జార్జియా, ఆర్మేనియా, ఇరాన్‌, బెలారస్‌, తుర్క్మెనిస్థాన్‌, కిర్గిజ్‌ రిపబ్లిక్‌, తజికిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌, మంగోలియా, కజకిస్థాన్‌ దేశాలకు చెందిన 21 మంది ప్రముఖ మీడియా ప్రతినిధుల బృందం శిల్పారామాన్ని సందర్శించిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

Similar News

News December 3, 2025

ఓపెన్ కాని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వెబ్‌సైట్‌‌

image

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వెబ్‌సైట్‌‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఓపెన్ చేస్తే గేమింగ్ సైట్‌కు రీడైరెక్ట్ అవుతోందని అధికారులు వెల్లడించారు. సమస్యపై ఐటీ నిపుణులు పని చేస్తున్నారు. పూర్తిస్థాయి పునరుద్ధరణకు వారం రోజులు పట్టే అవకాశం ఉందని సైబర్ క్రైం డీసీపీ సుధీంద్ర తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News December 2, 2025

ఈ నెల 7న ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తున్నా: సీఎం

image

ఈ నెల 7న ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తున్నా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. మంగళవారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడారు. ‘ఎంతో మంది ఉద్దండులను అందించిన ఓయూని కేసీఆర్ కాల గర్భంలో కలిపేశారు. యూనివర్సిటీని ప్రపంచ స్థాయిలో నిలబెట్టేందుకు ఎంతైనా ఖర్చు చేస్తా’ అని చెప్పారు. కాగా ఇప్పటికే ఓయూని సందర్శించిన రేవంత్ రెడ్డి భారీగా నిధులు కేటాయిస్తామని చెప్పిన విషయం తెలిసిందే.

News December 2, 2025

HYD: సర్పంచ్ ఎన్నికలే లక్ష్యం.. టీబీజేపీ దూకుడు

image

రాష్ట్రంలో జరగనున్న సర్పంచ్ ఎన్నికల్లో 1000 సీట్లు గెలవాలని టీబీజేపీ TBJP లక్ష్యంగా పెట్టుకుంది. జూబ్లీహిల్స్ బైపోల్ ఓటమి తర్వాత, పార్టీ ఈ వ్యవస్థీకృత కార్యాచరణను ప్రారంభించింది. ఈ ఎన్నికల ఖర్చును పూర్తిగా సిట్టింగ్, గతంలో పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులే భరించాలని ఆదేశించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఓటు శాతాన్ని, నాయకత్వాన్ని బలోపేతం చేయడమే ఈ వ్యూహం ముఖ్యోద్దేశమని పార్టీ వర్గాలు తెలిపాయి.