News February 5, 2025
శివంపేట హత్య కేసు UPDATE

శివంపేట మండలం సామ్యతండాలో శనివారం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. తండాకు చెందిన మదన్‌లాల్‌ను కత్తితో పొడిచి హత్య చేయగా ఈ కేసుపై తూప్రాన్ సీఐ రంగాకృష్ణ దర్యాప్తు చేపట్టారు. మదన్‌లాల్‌ను అన్న కొడుకే హత్య చేసినట్లు గుర్తించినట్లు సమాచారం. అతడికి సహకరించిన మరో వ్యక్తిని సైతం అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
Similar News
News January 19, 2026
‘మెదక్ జిల్లాను చార్మినార్ జోన్‌లో కలపాలి’

మెదక్ జిల్లాను చార్మినార్ జోన్‌లో కలపాలని జిల్లా వ్యాప్తంగా తహశీల్దార్‌కు వినతిపత్రాలు అందజేశారు. మెదక్ జిల్లాని రాజన్న సిరిసిల్ల జోన్‌లో గత ప్రభుత్వం అనాలోచితంగా కలిపిందని పలువురు ఆరోపించారు. నిరుద్యోగులు గ్రేడ్-4 స్థాయి ఉద్యోగాలకే పరిమితమయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. చార్మినార్ జోన్‌లో కలిపి ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలని కోరారు.
News January 19, 2026
నేడు ‘ప్రజావాణి’ రద్దు: మెదక్ కలెక్టర్

మున్సిపల్ ఎన్నికల సన్నాహక పనుల దృష్ట్యా సోమవారం జిల్లా కలెక్టరేట్‌తో పాటు నాలుగు మున్సిపాలిటీల్లో నిర్వహించాల్సిన ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. జిల్లా స్థాయి అధికారులందరూ ఎన్నికల విధుల్లో నిమగ్నమైనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అన్ని మండల తాహశీల్దార్ కార్యాలయాల్లో ప్రజావాణి యథావిధిగా కొనసాగుతుందని, ప్రజలు ఈ మార్పును గమనించాలని ఆయన కోరారు.
News January 17, 2026
మెదక్: మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు: కలెక్టర్

మెదక్ జిల్లాలోని మున్సిపాలిటీల వార్డు రిజర్వేషన్లను రాజకీయ పార్టీల సమక్షంలో పారదర్శకంగా ఖరారు చేసినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మెదక్‌లో 32, తూప్రాన్‌లో 16, నర్సాపూర్‌లో 15, రామాయంపేటలో 12 వార్డులకు రిజర్వేషన్లు కేటాయించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ప్రక్రియ పూర్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు.


