News July 29, 2024

శివచంద్రారెడ్డికి భద్రత కల్పించాలి: హైకోర్టు

image

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షి కొమ్మా శివచంద్రారెడ్డికి తొలగించిన సెక్యూరిటీని తక్షణం పునరుద్ధరించాలని హైకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. శివచంద్రారెడ్డి గన్‌మెన్లను ఇటీవల ఉపసంహరించడంపై హైకోర్టులో న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ ద్వారా పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన న్యాయస్థానం భద్రత కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది.

Similar News

News February 24, 2026

28న గన్నవరంలో జాబ్ మేళా

image

ఈనెల 28న ఉదయం 9 గంటలకు గన్నవరం గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు గన్నవరం ఎమ్మెల్యే వెంకటరావు సోమవారం తెలిపారు. SSC, ఇంటర్, ITI, డిప్లొమా, డిగ్రీ, బీ టెక్ ఉత్తీర్ణులైన వారు అర్హులన్నారు. 18-35 ఏళ్ల వయసున్నవారు పాల్గొనవచ్చన్నారు. ఈ మేళాలో ప్రముఖ సంస్థలు పాల్గొని నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తాయని పేర్కొన్నారు.

News February 24, 2026

ప్రజల అర్జీలకు అధిక ప్రాధాన్యత: కలెక్టర్

image

ప్రజల నుంచి అందే అర్జీలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి, సకాలంలో సానుకూలంగా పరిష్కరించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం మచిలీపట్నంలో జాయింట్ కలెక్టర్ నవీన్‌తో కలిసి ప్రజల నుంచి ఆయన అర్జీలు స్వీకరించారు. ఉద్యోగుల గ్రీవెన్స్‌డే నిర్వహించి వివిధ శాఖల ఉద్యోగుల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం మీ-కోసం కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు.