News February 23, 2025

శివరాత్రి స్పెషల్.. అప్పికొండ, R.K బీచ్‌లకు ప్రత్యేక బస్సులు

image

శివరాత్రి జాగరణ అనంతరం సముద్ర స్నానాలు ఆచరించే వారి కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు విశాఖ జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలనాయుడు శనివారం తెలిపారు. ఫిబ్రవరి 26 అర్ధరాత్రి నుంచి 27 సాయంత్రం వరకు గాజువాక, కుర్మన్నపాలెం, అగనంపూడి నుంచి అప్పికొండకు.. తగరపువలస, భీమిలి, ఆరిలోవ కాలనీ, రవీంద్ర నగర్, పెందుర్తి, కొత్తవలస, సింహాచలం, గాజువాక నుంచి ఆర్.కె.బీచ్‌కు బస్సులు నడపనున్నట్లు వెల్లడించారు.

Similar News

News March 27, 2025

విశాఖ ఘటనపై హోంమంత్రి అనిత ఆగ్రహం

image

విశాఖలో ఎనిమిదేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటనపై హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చితో ఫోన్‌లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇంట్లో ఉన్న అమాయక చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన కీచకుడిని వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని హోంమంత్రి ఆదేశించారు. నిందితుడుని గుర్తించి పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని హోం మంత్రికి సీపీ తెలిపారు.

News March 27, 2025

విశాఖలో లులూ మాల్‌కు భూమి కేటాయింపు

image

విశాఖలో లులూ గ్రూప్ నిర్మించనున్న షాపింగ్ మాల్, హైపర్ మార్కెట్ల నిర్మాణానికి భూమి కేటాయించాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ఏపీఐఐసీ ద్వారా భూకేటాయింపులు చేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బీచ్ రోడ్‌లోని హార్బర్ పార్కులో ఉన్న 13.43 ఎకరాలను ఏపీఐఐసీకి బదలాయించాలని వీఎంఆర్డీఏకు ఆదేశాలు జారీ చేసింది. లులూ గ్రూప్ విశాఖలో పెట్టుబడులకు ఎస్ఐపీబీలో ఆమోదించినట్టు పరిశ్రమల శాఖ తెలిపింది.

News March 27, 2025

విశాఖలో ముఠా.. నకిలీ వెండి అమ్ముతూ అరెస్ట్

image

విశాఖలో బిహార్‌కు చెందిన ఇద్దరు మహిళలు నకిలీ వెండి అమ్ముతూ పోలీసులకు చిక్కారు. నగరంలోని ఓ జువెలరీ షాపులో 3 కేజీల వెండిని అమ్మేందుకు వెళ్లారు. అనుమానంతో షాపు సిబ్బంది పరీక్షించగా అది నకిలీదిగా తేలడంతో ద్వారకా పోలీసులకు సమాచారమిచ్చారు. ఇదే షాపులోని 2023లో నిందితులు ఏడు గ్రాముల గోల్డ్ కొట్టేసినట్లు గుర్తించారు. వీరంతా ఒక ముఠాగా ఏర్పడి నకిలీ ఐడీలతో మోసాలకు పాల్పడి అనంతరం సొంతూళ్లకు వెళ్లిపోతారు.

error: Content is protected !!