News February 19, 2025

శివాజీ జయంతి: హోరెత్తనున్న నల్గొండ

image

హిందూ ధర్మానికి వన్నె తెచ్చిన వీరుడు, మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ 398వ జయంతి ఉత్సవాలకు నల్గొండ ముస్తాబైంది. పల్లెపల్లెనా, మండల కేంద్రాలతో పాటు జిల్లా కేంద్రంలో పెద్దఎత్తున ర్యాలీలు తీసేందుకు ఇప్పటికే ఏర్పాట్లుచేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలో శివాజీ మహారాజ్ శోభాయాత్ర ఉంటుందని హిందూవాహినీ సభ్యులు తెలిపారు. రామగిరి రామాలయం నుంచి సాయంత్రం 4 గంటలకు ర్యాలీ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.

Similar News

News November 21, 2025

NLG: డబుల్ లబ్ధిదారుల్లో.. 46 మంది అనర్హులు..!

image

నల్గొండ మున్సిపాలిటీ పరిధిలోని గొల్లగూడ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీలో 46 మంది లబ్ధిదారులను అధికారులు అనర్హులుగా గుర్తించారు. వారి స్థానంలో ‘ప్రజా పాలన’ దరఖాస్తుల ద్వారా అర్హులైన వారిని పారదర్శకంగా డ్రా ద్వారా ఎంపిక చేశారు. మొత్తం 552 మంది లబ్ధిదారులకు త్వరలో ఇళ్లను పంపిణీ చేయనున్నట్లు ఆర్డీవో అశోక్ రెడ్డి, హౌసింగ్ పీడీ రాజ్ కుమార్ తెలిపారు.

News November 21, 2025

ఖనిజ రవాణా వాహనాలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి

image

నల్గొండ జిల్లాలో కంకర, ఇసుక, ఇటుక వంటి ఖనిజాలను రవాణా చేసే వాహనాలు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని మైన్స్ ఏడీ సామ్యేల్ జాకాబ్ స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ లేకుండా ఖనిజాలను సరఫరా చేస్తే జరిమానాలతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కలెక్టర్‌ ఆధ్వర్యంలోని డీఎల్‌ఎస్‌ కమిటీ నిర్ణయం మేరకు, వినియోగదారులకు ఇసుక సరసమైన ధరలకే అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

News November 21, 2025

NLG: కొత్త రూల్స్ అమలు.. దరఖాస్తులు షురూ

image

కంకర మిల్లులకు ప్రభుత్వం తాజాగా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఓవర్ లోడ్‌తో వెళ్లే వాహనాల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున సమూల మార్పులకు ప్రభుత్వం కసరత్తు చేసింది. అందులో భాగంగానే క్రషర్ మిల్లులకు, ఖనిజాన్ని సరఫరా చేసే వాహనాల విషయంలో కొత్త రూల్స్ అమలు చేసింది. దీంతో జిల్లాలో 20 క్రషర్ మిల్లుల యజమానులు, 150 టిప్పర్ల యజమానులు కూడా తిరిగి రిజిస్ట్రేషన్ కోసం మైనింగ్ ఆఫీసులో దరఖాస్తు చేసుకున్నారు.