News February 19, 2025
శివాజీ జయంతి: హోరెత్తనున్న భువనగిరి

హిందూ ధర్మానికి వన్నె తెచ్చిన వీరుడు ఛత్రపతి శివాజీ 398వ జయంతి ఉత్సవాలకు భువనగిరి ముస్తాబైంది. పల్లెపల్లెనా, మండల కేంద్రాలతో పాటు జిల్లా కేంద్రంలో పెద్దఎత్తున ర్యాలీలు తీసేందుకు ఇప్పటికే ఏర్పాట్లుచేశారు. జిల్లా కేంద్రంలో ఉదయం 9 గంటలకు శివాజీ మహారాజ్ శోభాయాత్ర ఉంటుందని బీజేపీ పట్టన అధ్యక్షుడు బలరాం తెలిపారు. హనుమాన్ వాడ నుంచి నల్గొండ చౌరస్తా శివాజీ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగుతుందని పేర్కొన్నారు.
Similar News
News November 23, 2025
జీపీవోల సంఘం ఉమ్మడి జిల్లా కన్వీనర్గా శ్రీనివాస్

గ్రామ పాలనాధికారుల(జీపీవో) సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్గా జనగామకు చెందిన పెండెల శ్రీనివాస్ నియమితులయ్యారు. తనపై నమ్మకంతో ఉమ్మడి జిల్లా బాధ్యతలు అప్పగించిన ఆ సంఘం రాష్ట్ర నాయకత్వానికి కృతఙ్ఞతలు తెలిపారు. జీపీవోల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఆయనకు పలువురు అభినందనలు తెలిపారు.
News November 23, 2025
సాయి సేవా స్ఫూర్తితోనే అభివృద్ధి: సీఎం చంద్రబాబు

మన ముందు నడయాడిన దైవం శ్రీ సత్యసాయిబాబా శత జయంతి సందర్భంగా ఆయన చూపిన సేవా మార్గాన్ని స్మరించుకుందామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. విద్య, వైద్యం, తాగునీరు వంటి సేవలతో ‘మానవ సేవే మాధవ సేవ’ అని బాబా నిరూపించారని తెలిపారు. సత్యసాయి సిద్ధాంతం ద్వారా ప్రపంచానికి జ్ఞానం, సన్మార్గం లభించాయని, ఆయన స్ఫూర్తితోనే రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తామని సీఎం దివ్యాంజలి ఘటించారు.
News November 23, 2025
కొత్తగూడెం: దుప్పి మాంసం కేసు.. రిమాండ్

అశ్వాపురం మండలం మిట్టగూడెంలో దుప్పిని వేటాడి మాంసం విక్రయించిన కేసులో ఇద్దరు నిందితులకు కొత్తగూడెం జిల్లా కోర్టు మేజిస్ట్రేట్ శనివారం 14 రోజుల రిమాండ్ విధించారు. మిట్టగూడేనికి చెందిన సప్కా వీరస్వామి, కనితి కన్నయ్యలను శుక్రవారం రాత్రి దుప్పి మాంసంతో సహా అటవీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని జిల్లా కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి రిమాండ్ ఉత్తర్వులు జారీ చేశారు.


