News February 25, 2025
శివ భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలి: మంత్రి

రాష్ట్ర నలుమూలల నుంచి శ్రీశైలం వచ్చే శివ భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి ఫరూక్ ఆదేశించారు. మంగళవారం మహా శివరాత్రి ఏర్పాట్లపై మంత్రి ఫరూక్, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, కలెక్టర్ రాజకుమారి, ఇతర అధికారులతో సమీక్షించారు. బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వ అన్ని విభాగాలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని కలెక్టర్ను మంత్రి ఆదేశించారు.
Similar News
News October 16, 2025
VKB: 129 వరి ధాన్యం కేంద్రాలు ఏర్పాటు: కలెక్టర్

జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు నిర్వహించేందుకు 129 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. గురువారం కలెక్టరేట్లో వరి ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం క్వింటాల్ ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.2,389, సాధారణ రకానికి రూ.2,269 మద్దతు ధరను నిర్ధారించినట్లు చెప్పారు.
News October 16, 2025
ఖమ్మం: అడవి పంది మృతి.. ముగ్గురిపై కేసు

వేంసూరు మండలం ఎర్రగుంటపాడులో వరి పొలంలో పురుగు మందు పిచికారి చేయగా, ఆ నీరు తాగి ఓ అడవి పంది మృతి చెందింది. ఈ కళేబరాన్ని ఆయిల్పామ్ తోటలో పోగులు వేస్తున్న వాసం రామకృష్ణ, వాసం వెంకటేశ్వరరావు, చిలక సాయిపై వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు ఎఫ్ఎస్ఓ నర్సింహ్మ తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకున్నామని, అటవీ జంతువులను వేటాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News October 16, 2025
సంగారెడ్డి: మహిళల కోసమే భరోసా కేంద్రం: ఎస్పీ

మహిళల కోసమే భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఎస్పీ పారితోష్ పంకజ్ తెలిపారు. భరోసా కేంద్రం 5వ వార్షికోత్సవం బుధవారం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. మహిళలకు ఎలాంటి సమస్యలు ఉన్న ఈ కేంద్రంలో సంప్రదించవచ్చని చెప్పారు. కేంద్రం పనితీరు చాలా బాగుందని ప్రశంసించారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.