News April 8, 2025
శిశు మరణాల రేటు తగ్గించడమే లక్ష్యంగా పనిచేయాలి: కలెక్టర్

శిశు మరణాల రేటు తగ్గించడమే ఆరోగ్యశాఖ ముఖ్య లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు.సోమవారం సూర్యాపేట కలెక్టరేట్లో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య శాఖ అధికారులతో నిర్వహించిన సదస్సులో మాట్లాడారు. గర్భిణీలకు ప్రసవం జరిగే వరకు ఆరోగ్య కార్యకర్తలు సూచనలను సలహాలు ఇచ్చి తల్లి బిడ్డ ఆరోగ్యం కోసం కృషి చేయాలన్నారు. సదస్సులో జిల్లా వైద్యాధికారి కోటచలం సిబ్బంది ఉన్నారు.
Similar News
News November 22, 2025
HYD: నిద్రావస్థలో.. నిఘా నేత్రం!

‘మేము సైతం’ నినాదంతో ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాల పర్యవేక్షణపై రాచకొండ కమిషనరేట్ పరిధిలోని బాలాపూర్ సీతాఎవెన్యూ కాలనీల్లో నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఒక్క కెమెరా వంద మంది పోలీసులతో సమానమైనా, వాటి నిర్వహణకు స్థానిక పోలీసులు శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఉగ్రవాదుల కదలికలు పెరుగుతున్న నేపథ్యంలో, సీసీ కెమెరాల వ్యవస్థపై పోలీస్ బాస్లు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
News November 22, 2025
HYD: నిద్రావస్థలో.. నిఘా నేత్రం!

‘మేము సైతం’ నినాదంతో ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాల పర్యవేక్షణపై రాచకొండ కమిషనరేట్ పరిధిలోని బాలాపూర్ సీతాఎవెన్యూ కాలనీతోపాటు మీర్పేట్ MLR కాలనీలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఒక్క కెమెరా వంద మంది పోలీసులతో సమానమైనా వాటి నిర్వహణకు పోలీసులు శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఉగ్రవాదుల కదలికలు పెరుగుతున్న నేపథ్యంలో సీసీ కెమెరాల వ్యవస్థపై పోలీస్ బాస్లు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
News November 22, 2025
పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్స్ జీవో విడుదల

TG: పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం జీవో 46ను విడుదల చేసింది. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని జీవోలో స్పష్టం చేసింది. SC, ST, BC, మహిళా రిజర్వేషన్లను రొటేషన్ పద్ధతిలో అమలు చేయనుంది. ST రిజర్వేషన్లు ఖరారయ్యాక SC, BC రిజర్వేషన్లు ఉంటాయి. రేపు సా.6 గంటల్లోపు ఖరారు చేసిన రిజర్వేషన్లను పంచాయతీరాజ్ శాఖకు కలెక్టర్లు అందించనున్నారు.


