News April 2, 2024

శుభ ముహూర్తం

image

తేది: ఏప్రిల్ 2, మంగళవారం
బహుళ షష్ఠి: ఉదయం 07:54 గంటలకు
విశాఖ: మధ్యాహ్నం 02:42 గంటలకు
దుర్ముహూర్తం: ఉదయం 06:24-07:59 గంటల వరకు
వర్జ్యం: సాయంత్రం 06:54- 08:35 గంటల వరకు

Similar News

News November 8, 2024

సిద్ధూ మూసేవాలా తమ్ముడిని పరిచయం చేసిన పేరెంట్స్

image

ప్రముఖ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య తర్వాత అతని పేరెంట్స్ IVF ద్వారా మార్చిలో మరో మగ బిడ్డకు జన్మనిచ్చారు. అతనికి శుభ్‌దీప్(సిద్ధూ రియల్ నేమ్ ఇదే) అని పేరు పెట్టారు. తాజాగా అతని ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తమకు శుభాకాంక్షలు తెలిపిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం తన భార్య ఆరోగ్యం బాగుందని పేర్కొన్నారు. కాగా 58 ఏళ్ల వయసులో పిల్లాడిని కనడంపై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే.

News November 8, 2024

APPLY NOW: 457 ప్రభుత్వ ఉద్యోగాలు

image

UPSC ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్-2025కు ఈ నెల 22 వరకు అప్లై చేసుకోవచ్చు. రైల్వే, టెలికం, డిఫెన్స్ లాంటి కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 457 పోస్టులను భర్తీ చేస్తారు. బీఈ/బీటెక్ పూర్తైన 21-30 ఏళ్లలోపు వారు దరఖాస్తుకు అర్హులు. నవంబర్ 23 నుంచి 29 వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్ష వచ్చే ఏడాది జూన్ 8న రెండు సెషన్లలో జరుగుతుందని తాజాగా UPSC ప్రకటించింది.
వెబ్‌సైట్: <>https://upsc.gov.in/<<>>

News November 8, 2024

నేడు మలేషియాకు KTR

image

TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఇవాళ మలేషియా పర్యటనకు వెళ్లనున్నారు. మలేషియా తెలంగాణ అసోసియేషన్ దశాబ్ది ఉత్సవాల్లో ఆయన పాల్గొననున్నారు. తెలంగాణ ఏర్పాటైన 2014లో ఈ అసోసియేషన్‌ను KCR ప్రారంభించారు. ఈ నేపథ్యంలో దశాబ్ది వేడుకల్లో పాల్గొనాలని నిర్వాహకులు ఆహ్వానించడంతో KTRతో పాటు జగదీశ్ రెడ్డి, గోరటి వెంకన్న, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్ కుమార్, బాల్క సుమన్ బయల్దేరుతున్నారు.