News February 26, 2026

శుభ సమయం (26-2-2026) గురువారం

image

➤ తిథి: శుద్ధ దశమి రా.12.38 వరకు
➤ నక్షత్రం: మృగశిర మ.12.33 వరకు
➤ శుభ సమయాలు: ఉ.6.21-7.20, ఉ.9.16-10.13, ఉ.11.01-మ.12.10, మ.1.08-2.06, సా.4.03-5.59
➤ రాహుకాలం: మ.1.30-3.00 వరకు
➤ యమగండం: ఉ.6.00-7.30
➤ దుర్ముహూర్తం: ఉ.10.14- మ.11.00, మ.2.53-3.39
➤ వర్జ్యం: రా.8.25-9.56
➤ అమృత ఘడియలు: రా.1.40-3.10

Similar News

News April 20, 2026

సీఎం చంద్రబాబుపై సినిమా

image

AP: సీఎం చంద్రబాబు జీవితం, పరిపాలనా విశేషాలతో ‘ధర్మచక్రం’ సినిమాను నిర్మించినట్లు దర్శక, నిర్మాత పసుపులేటి వెంకట రమణ వెల్లడించారు. CBN బర్త్ డే సందర్భంగా ఇవాళ 13 జిల్లాల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తామని తెలిపారు. చంద్రబాబు రాష్ట్రానికి చేస్తున్న సేవలను, ఆయనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేలా ఇందులో వాస్తవాలను చూపించామని పేర్కొన్నారు.

News April 20, 2026

చేతికి రెండు ఫ్రాక్చర్లు.. అయినా మూడు వికెట్లు

image

ఫామ్ లేమితో సతమతమైన KKR స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఎట్టకేలకు నిన్న RRతో జరిగిన మ్యాచ్‌లో కమ్‌బ్యాక్ ఇచ్చారు. 4 ఓవర్లు వేసి 14 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టారు. అయితే IPL సీజన్‌కు ముందు తాను గాయపడ్డట్లు వరుణ్ తెలిపారు. ఇప్పటికీ లెఫ్ట్ హ్యాండ్‌లో 2 ఫ్రాక్చర్స్ ఉన్నట్లు వెల్లడించారు. ఆ నొప్పితోనే బౌలింగ్ చేస్తున్నట్లు చెప్పారు. దాన్ని అధిగమించడానికే ట్రై చేస్తున్నట్లు తెలిపారు.

News April 20, 2026

మెగాస్టార్ సినిమాలో అనిల్ కపూర్?

image

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబినేషన్‌లో వస్తున్న మూవీలో బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఇటీవల బాబీ ఆయనకు కథ వినిపించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఈ సినిమాలో మోహన్‌లాల్ కూడా నటిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వీరిద్దరి రోల్స్ కన్ఫర్మ్ అయితే మెగా సినిమాకు పాన్ ఇండియా హిట్ ఖాయమని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.