News August 14, 2024
శృంగవరపుకోట: కన్నబిడ్డల కళ్లెదుటే తల్లి హత్య

కన్నబిడ్డల ఎదుటే భార్యను, భర్త హత్య చేసిన ఘటన విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో జరిగింది. సీఐ నారాయణమూర్తి వివరాల మేరకు.. మూలబొడ్డవర పంచాయతీకి చెందిన డి.దేముడు భార్యపై అనుమానంతో ఆదివారం రాత్రి టేకు చెక్కతో దాడి చేశాడు. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లగా..స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ మృతిచెందింది. దీనిపై కేసు దర్యాప్తులో ఉందని, నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.
Similar News
News November 24, 2025
డ్రగ్స్ కేసుల్లో గత 16 నెలల్లో 2,467 మంది అరెస్ట్: DIG

గత 16 నెలల్లో 2,467 మంది డ్రగ్స్ కేసుల్లో అరెస్ట్ అయినట్లు రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి తెలిపారు. విజయనగరంలో సోమవారం జరిగిన అభ్యుదయం సైకిల్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. డ్రగ్స్ వలన కుటుంబాలు, భవిష్యత్తు, వ్యక్తిత్వం పూర్తిగా దెబ్బతింటుందని, గంజాయి లేదా డ్రగ్స్ వినియోగం, రవాణా, అమ్మకం ఏదైనా చేస్తే జైలుశిక్ష తప్పదన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు 1000 కి.మీ ‘అభ్యుదయం సైకిల్ ర్యాలీ’ చేపట్టామన్నారు.
News November 24, 2025
ఆలయ నిర్మాణాలకు దరఖాస్తులు చేసుకోండి: AC

TTD శ్రీవాణి ట్రస్ట్ నిధులతో గ్రామాల్లో భజన మందిరాల నిర్మాణం కోసం దరఖాస్తులు చేసుకోవాలని దేవాదాయ శాఖ విజయనగరం జిల్లా AC శిరీష ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు. నిర్మాణ స్థలం ఆధారంగా మందిరాలను టైప్ A, B, Cలుగా విభజించి రూ.10 లక్షల నుండి రూ.20 లక్షల వరకు నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. స్థల వివరాలు, యజమాని NOCను జతచేసి, దరఖాస్తులను తోటపాలెంలో ఉన్న దేవాదాయ శాఖ కార్యాలయానికి అందజేయాలన్నారు.
News November 24, 2025
అత్యాచారం కేసులో వ్యక్తికి 12 ఏళ్ల జైలు: SP

2019లో గరివిడిలో మహిళపై అత్యాచారానికి పాల్పడిన బొండపల్లికి చెందిన సవిరిగాన సూర్యనారాయణకు విజయనగరం మహిళా కోర్టు 12 ఏళ్ల కఠిన కారాగార, శిక్ష రూ.2వేల జరిమానా విధించిందని ఎస్పీ దామోదర్ ఇవాళ తెలిపారు. బాధితురాలి ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు పూర్తి చేసి అభియోగపత్రం దాఖలు చేశారన్నారు. PP సత్యం వాదనలతో నిందితుడిపై నేరం రుజువైందన్నారు. దర్యాప్తు చేసిన అధికారులను ఎస్పీ అభినందించారు.


