News September 9, 2024
శృంగేరి పీఠానికి బయలుదేరిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ ఎమ్మెల్యే , ఆది శ్రీనివాస్ ఆదివారం రాత్రి శృంగేరి పీఠానికి బయలుదేరారు. దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టేందుకు శృంగేరి పీఠాధిపతుల అనుమతులు పొందడానికి వెళ్లినట్టు తెలిపారు. వివిధ నిర్మాణాల నమూనాలు, నిర్మాణ ప్రాంతాల ఫొటోలతో పీఠాధిపతులకు వివరించనున్నారు.
Similar News
News October 5, 2024
హుజూరాబాద్‌లో దారుణ హత్య
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలోని రాజపల్లెలో వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. రాజు అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు తలపై కొట్టి చంపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News October 5, 2024
కోరుట్ల ఎస్సై- 2 శ్వేతను సస్పెండ్ చేసిన ఐజీ
జగిత్యాల జిల్లాలో కోరుట్ల పోలీస్‌స్టేషన్లో ఎస్సై-2 గా పనిచేసిన శ్వేతను సస్పెండ్ చేస్తూ మల్టీజోన్ ఐజీ చంద్రశేఖర్ ఉత్తర్వులు జారీచేశారు. జగిత్యాల పట్టణానికి చెందిన శివకుమార్ అనే వ్యక్తిపై గత నెల29న ఎస్సై శ్వేత చేయిచేసుకున్నారని పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై పోలీస్‌శాఖ అధికారులు విచారణ చేపట్టారు. నివేదిక ఆధారంగా ఎస్సై-2 శ్వేతను సస్పెండ్ చేసినట్లు ఐజీ ప్రకటన జారీ చేశారు.
News October 5, 2024
కాటారం:అరుదైన అటవీ జంతువును తరలిస్తున్న ముఠా పట్టివేత?
అటవీ జంతువుల్లో అరుదుగా లభించే ‘అలుగు’ను తరలిస్తున్న ముఠాను టాస్క్‌ఫోర్స్ అధికారులు పట్టుకున్నట్లు తెలిసింది. పక్కా సమాచారం మేరకు అలుగును తరలిస్తున్న ముఠాను కాటారం మండలం మేడిపల్లి వద్ద అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయసమాచారం. ఈముఠాలో కాటారం సబ్ డివిజన్‌కు చెందిన ఓ అధికార పార్టీ నాయకుడు, మరో ఇద్దరూ ఉన్నట్లు తెలిసింది. కాగా సదరు అలుగు విలువ రూ. 70లక్షల నుంచి రూ.కోటి పైనే ఉంటుందని సమాచారం.