News March 28, 2025

శెట్టిపల్లి భూముల సమస్యలను త్వరలో పరిష్కరిస్తాం: మంత్రులు

image

తిరుపతి అర్బన్ మండలంలోని శెట్టిపల్లి భూముల సమస్యలను వచ్చేనెల చివరిలోపు పరిష్కరిస్తామని మంత్రులు నారాయణ, అనగాని సత్యప్రసాద్ హామీ ఇచ్చారు. గురువారం అమరావతిలో శెట్టిపల్లె భూముల సమస్యలను కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, నగర పాలక సంస్థ కమిషనర్ మౌర్య మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. శెట్టిపల్లి భూముల లబ్ధిదారులకు లాటరీ పద్ధతిపై ఒక్కొక్కరికి ఒకటిన్నర సెంటు భూమి కేటాయిస్తామని మంత్రులు తెలిపారు.

Similar News

News November 6, 2025

మాలేపాటి కుటుంబానికి లోకేశ్ పరామర్శ

image

దగదర్తిలోని మాలేపాటి నివాసానికి మంత్రి నారా లోకేశ్ చేరుకున్నారు. సుబ్బానాయుడు, భాను చిత్రపటాలకు మంత్రి నివాళులు అర్పించారు. అనంతరం మాలేపాటి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ధైరంగా ఉండాలని సూచించారు. టీడీపీ ఎల్లవేళలా అండగా ఉంటుందని లోకేశ్ భరోసా ఇచ్చారు. లోకేశ్ వెంట నెల్లూరు జిల్లా MLAలు ఉన్నారు.

News November 6, 2025

విజయ డెయిరీ మాజీ ఛైర్మన్ జానకి రామయ్య మృతి

image

విజయ డెయిరీ మాజీ ఛైర్మన్ మండవ జానకి రామయ్య (93) మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం గన్నవరం శివారు రుషి వాటిక వృద్ధుల నిలయంలో తుదిశ్వాస విడిచారు. సుదీర్ఘ కాలం విజయ డెయిరీ ఛైర్మన్‌గా సేవలందించిన మండవ, పాడి రైతుల సంక్షేమం కోసం నిర్విరామంగా కృషి చేశారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

News November 6, 2025

ప్రకాశం: చెరువులో పడి విద్యార్థి మృతి

image

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలో విషాదం నెలకొంది. ఈదుమూడి గ్రామానికి చెందిన కటారి అఖిల్(12) ఆడుకుంటూ ప్రమాదవశాత్తు గ్రామంలోని ఊర చెరువులో పడి మృతిచెందాడు. సమాచారం అందుకున్న స్థానికులు మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.