News March 24, 2024
శెట్టూరు-కుందుర్పి రహదారిపై రోడ్డు ప్రమాదం

శెట్టూరు మండలం కంబాలపల్లి వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కంబాలపల్లికి చెందిన గొల్ల తిమ్మయ్య (30) మృతి చెందగా, ప్రసాద్ గాయపడినట్లు స్థానికులు తెలిపారు. వారు బైక్‌పై కుందుర్పికి వెళ్లి వస్తుండగా ఎద్దుల బండిని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గొల్ల తిమ్మయ్య తల, పొట్ట భాగంలో బలమైన గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం కళ్యాణదుర్గం ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో చనిపోయారు.
Similar News
News October 22, 2025
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి: DMHO

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని DMHO దేవి వైద్యులకు సూచించారు. అనంతపురం జిల్లాలోని పట్టణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలోని వైద్యులు, సిబ్బందితో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ద్వారా వచ్చిన అర్జీలకు తక్షణమే స్పందించాలని ఆదేశించారు. వైద్య సేవలపై ప్రజల్లో మంచి దృక్పథం వచ్చేలా ఆసుపత్రికి వచ్చిన రోగులకు సేవలను అందించాలన్నారు.
News October 22, 2025
పథకాలు, కార్యక్రమాలపై రైతులకు అవగాహన కల్పించండి: కలెక్టర్

వ్యవసాయ, అనుబంధ రంగాలలో అమలవుతున్న పథకాలు, కార్యక్రమాలపై రైతులకు శిక్షణ ఇవ్వాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. అనంతపురం కలెక్టరేట్లో వ్యవసాయ, అనుబంధ రంగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతులకు అవగాహన కల్పించి, సందేహాలను నివృత్తి చేసి, నూతన సాంకేతికతను తెలియజేయాలన్నారు. శిక్షణా కార్యక్రమాలకు ఆత్మ పీడీ నోడల్ అధికారిగా ఉండాలన్నారు.
News October 22, 2025
గుత్తి పీఎస్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

గుత్తి పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ జగదీశ్ బుధవారం సాయంత్రం తనిఖీ చేశారు. ముందుగా సీఐ రామారావు, ఎస్ఐ సురేశ్ గౌరవ వందనంతో ఎస్పీకి స్వాగతం పలికారు. అనంతరం పోలీసు స్టేషన్ నిర్వహణ, పరిసర ప్రాంతాలు, సిబ్బంది పనితీరు, విధులు, ముఖ్యమైన కేసుల దర్యాప్తు, స్టేషన్‌లో నిర్వహిస్తున్న కేసు డైరీ, విలేజ్ రోస్టర్, వివిధ క్రైమ్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.


