News March 24, 2024

శెట్టూరు-కుందుర్పి రహదారిపై రోడ్డు ప్రమాదం 

image

శెట్టూరు మండలం కంబాలపల్లి వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కంబాలపల్లికి చెందిన గొల్ల తిమ్మయ్య (30) మృతి చెందగా, ప్రసాద్ గాయపడినట్లు స్థానికులు తెలిపారు. వారు బైక్‌పై కుందుర్పికి వెళ్లి వస్తుండగా ఎద్దుల బండిని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గొల్ల తిమ్మయ్య తల, పొట్ట భాగంలో బలమైన గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం కళ్యాణదుర్గం ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో చనిపోయారు.

Similar News

News September 16, 2024

అనంతపురంలో క్రికెటర్ల ఫుడ్ మెనూ ఇదే!

image

అనంతపురంలో ఉంటున్న భారత క్రికెటర్లు ఆంధ్రా ఇడ్లీ రుచి చూస్తున్నారు. టమాటా బాత్, సాంబార్ ఇడ్లీని ఇష్టంగా తింటున్నారట. కోడిగుడ్డు, బ్రెడ్ ఆమ్లేట్, మొలకెత్తిన పెసలు, శనగలు వంటివి అల్పాహారంలో తీసుకుంటున్నారు. మధ్యాహ్నం, రాత్రి మూడు రకాల చికెన్ వంటకాలను మెనూలో ఉంచగా క్రికెటర్లను మటన్ బిర్యానీకి దూరంగా ఉంచారు. ప్లేయర్లు ఉదయం 8లోపే టిఫెన్ చేసి గ్రౌండ్‌కు వెళ్తున్నట్లు బీసీసీఐ ప్రతినిధులు తెలిపారు.

News September 16, 2024

అనంతపురంలో కిలో టమాటా రూ.33

image

అనంతపురం జిల్లాలో టమాటా కిలో రూ.33 పలుకుతున్నట్లు మార్కెట్ యార్డ్ కార్యదర్శి రాంప్రసాద్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రానికి సమీపంలోని కక్కలపల్లి టమాటా మార్కెట్లో గరిష్ఠంగా రూ.33తో క్రయవిక్రయాలు జరుగుతున్నాయన్నారు. దాదాపు 2,250 టన్నుల టమాటా దిగుబడులు వచ్చాయని తెలిపారు. ఇక కిలో సరాసరి ధర రూ.25, కనిష్ఠ ధర రూ.17గా ఉందని వివరించారు.

News September 16, 2024

ATP: పెళ్లికి పెద్దలు అడ్డుచెప్పారని యువకుడి ఆత్మహత్య

image

ప్రేమ పెళ్లికి కుటుంబ సభ్యులు అంగీకరించలేదని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనంతపురానికి చెందిన విజయ్ కుమార్ మేనమామ కుమార్తెను ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటానని యువతి ఇంట్లో సంప్రదించగా కుటుంబ సభ్యులు నిరాకరించారు. దీంతో మనస్తాపానికి గురైన విజయ్ పురుగు మందు తాగాడు. చికిత్స పొందుతూ సర్వజన ఆసుపత్రిలో మృతి చెందాడు. యువకుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు.