News October 5, 2024

శేరిలింగంపల్లి: దసరాకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

image

దసరా సందర్భంగా HCU ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు హెచ్‌సీయూ డిపో మేనేజర్ మురళీధర్ రెడ్డి తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ ప్రత్యేక బస్సులను ఈ నెల 12వ వరకు నడుపుతామన్నారు. లింగంపల్లి నుంచి MGBS వరకు, గచ్చిబౌలి నుంచి మహబూబ్ నగర్ వైపు, లింగంపల్లి నుంచి జహీరాబాద్ వైపు బస్సులు ఉంటాయని వివరించారు. వివరాలకు ఫోన్ నంబర్ 7382814235ను సంప్రదించాలని సూచించారు.

Similar News

News November 12, 2025

జూబ్లీహిల్స్: ‘కంపల్సరీ ఓటు’ చట్టం తెస్తే తప్ప మారరేమో..!

image

ప్రజాస్వామ్యం ప్రాణం పోసుకోవాలంటే ఓటు వేయండని ప్రభుత్వాలు, ఈసీ చెబుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. అందుకు జూబ్లీహిల్స్ ఎన్నికలే నిదర్శనం. కేవలం 48.49 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. కనీసం 50 శాతం కూడా దాటలేదు. ఇలా అయితే సమస్యలు అలాగే ఉండిపోతాయి. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఓటు వేయాల్సిందే అనే చట్టం తీసుకురావాలేమో.. అప్పుడైనా మన ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వస్తారేమో ఏమంటారు?

News November 12, 2025

జూబ్లీహిల్స్: ‘మనం గెలుస్తామా.. మెజార్టీ ఎంత..?’

image

ప్రతిష్ఠాత్మక జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ ముగియడంతో గెలుపు అవకాశాలపై కాంగ్రెస్, BRS, BJP నేతలు చర్చలు జరుపుతున్నారు. ‘షేక్‌పేట్, బోరబండ, యూసుఫ్‌గూడ, ఎర్రగడ్డ, రహమత్‌నగర్, వెంగళ్‌రావునగర్, సోమాజిగూడ డివిజన్లలో మన పార్టీకి ఎన్ని ఓట్లు పడి ఉంటాయి.. మనం గెలుస్తామా.. మెజార్టీ ఎంత వస్తుంది.. పోల్ మేనేజ్‌మెంట్ బాగా జరిగిందా’ అంటూ లోకల్ నేతలతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. దీనిపై మీ కామెంట్?

News November 12, 2025

HYD: సీఐడీ విచారణకు సినీ నటులు

image

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌ కేసులో సీఐడీ విచారణ వేగం పెంచింది. నిన్న నటుడు విజయ్‌ దేవరకొండను ప్రశ్నించిన అధికారులు, నేడు నటుడు ప్రకాశ్‌రాజ్‌ను విచారణకు పిలిపించారు. కేసుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, ప్రమోషన్‌ వివరాలపై సీఐడీ దర్యాప్తు కొనసాగిస్తోంది. గత 10 రోజుల క్రితం సీఐడీ అధికారులు నోటీసులు అందజేశారు.