News October 20, 2024

శేర్లింగంపల్లి: ఇన్నోవేషన్లకు పుట్టినిల్లుగా T-Hub

image

HYDలోని శేర్లింగంపల్లి రాయదుర్గం వద్ద ఏర్పాటు చేసిన T-Hub ఇన్నోవేషన్లకు పుట్టినిల్లుగా మారుతోంది. 20 దేశాలకు చెందిన 180 మంది ప్రముఖ ఇన్నోవేటర్లతో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నూతన టెక్నాలజీ, నూతన ఇన్నోవేషన్ల ద్వారా యువతకు ఉపాధి కల్పించే అంశాలపై చర్చలు జరిపినట్లుగా టెక్నోక్రాంట్ సాయి అభినయ్ తెలిపారు.

Similar News

News February 27, 2026

HYD: Gen Z తెలివి.. ‘చెత్త’ నుంచి డబ్బు!

image

HYD యువతలో ఇప్పుడు ‘అప్‌సైక్లింగ్’ ఒక మతంలా మారుతోంది. మురికివాడల్లో పారేసిన టైర్లు, విరిగిన ప్లాస్టిక్ డబ్బాలను సేకరించి వాటిని లగ్జరీ ఫర్నీచర్‌గా మార్చి ఆన్‌లైన్‌లో అమ్ముతున్నారు. ఇది కేవలం వ్యాపారం కాదు.. పర్యావరణం మీద వారికున్న ‘యూనిక్’ ప్రేమ. పాత సామన్ల మార్కెట్ (జుమ్మెరాత్ బజార్) వీరి పాలిట ఇప్పుడు ఒక ఐడియా బ్యాంక్. వ్యర్థాలను అర్థాలుగా మార్చుతున్న ఈ Gen Z తెలివితేటలు అమోఘం.

News February 27, 2026

KPHBలో గజం భూమి రూ. 2.65 లక్షలు

image

KPHBలో హౌసింగ్ బోర్డు స్థలాలు, ఫ్లాట్లు రికార్డు ధరలకు అమ్ముడయ్యాయి. తెలంగాణ హౌసింగ్ బోర్డు నిర్వహించిన బహిరంగ వేలంలో KPHBలో చదరపు గజం భూమి గరిష్ఠంగా రూ.2.65 లక్షలకు విక్రయమైంది. 1400 ఎస్‌ఎఫ్‌టీ ఫ్లాట్ ధర రూ.1.10 కోట్లకు చేరింది. మొత్తం 12 ఆస్తుల వేలం ద్వారా రూ.24.26 కోట్ల ఆదాయం లభించినట్లు వైస్‌ ఛైర్మన్ వి.పి.గౌతం తెలిపారు. ఓపెన్ ప్లాట్స్ ద్వారా రూ.15.81 కోట్లు, ఫ్లాట్స్ రూ.8.45 కోట్లు వచ్చాయి.

News February 27, 2026

HYD: ఆ రోజు ఆలయాలు బంద్!

image

చంద్రగ్రహణం దృష్ట్యా మార్చి 3న కడ్తాల్‌లోని మైసిగండి మైసమ్మ ఆలయంతో పాటు శివాలయ, రామాలయాలు మూసివేస్తున్నట్లు ఆలయ ఈవో స్నేహలత చెప్పారు. మూడో తేదీ ఉదయం ఏడు గంటల నుంచి 4వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఆలయాలను మూసివేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఆలయ శుద్ధి, అభిషేకం, అలంకరణ అనంతరం భక్తుల దర్శనానికి అనుమతిస్తామని చెప్పారు. గ్రహణం దృష్య్టా నగరంలోని ప్రముఖ ఆలయాలను సైతం మూసివేయనున్నారు.
SHARE IT