News October 20, 2024
శేర్లింగంపల్లి: ఇన్నోవేషన్లకు పుట్టినిల్లుగా T-Hub
HYDలోని శేర్లింగంపల్లి రాయదుర్గం వద్ద ఏర్పాటు చేసిన T-Hub ఇన్నోవేషన్లకు పుట్టినిల్లుగా మారుతోంది. 20 దేశాలకు చెందిన 180 మంది ప్రముఖ ఇన్నోవేటర్లతో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నూతన టెక్నాలజీ, నూతన ఇన్నోవేషన్ల ద్వారా యువతకు ఉపాధి కల్పించే అంశాలపై చర్చలు జరిపినట్లుగా టెక్నోక్రాంట్ సాయి అభినయ్ తెలిపారు.
Similar News
News November 2, 2024
BREAKING: చర్లపల్లి జైలుకు ముత్యాలమ్మ గుడి నిందితుడు
సికింద్రాబాద్ ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం కేసులో న్యాయస్థానం నిందితుడికి రిమాండ్ విధించింది. ప్రధాన నిందితుడైన సల్మాన్ సలీంకు 14 రోజులు రిమాండ్ విధించడంతో అతడిని చర్లపల్లి జైలుకు పోలీసులు తరలించారు. ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం కేసు విచారణను సిట్‌కు బదిలీ చేయగా ఈ ఘటనపై సిట్ 3 కేసులను నమోదు చేసింది.
News November 2, 2024
HYD: యువతిపై అత్యాచారం
HYD ఘట్‌కేసర్ పరిధిలో యువతిపై అత్యాచారం జరిగింది. సీఐ పి.పరశురాం తెలిపిన వివరాలు.. ఓ మార్ట్‌లో పని చేసే యువతిపై కజా బషీర్ (35) అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయట పెడితే చంపుతానని ఆమెను బెదిరించాడు. ఈ క్రమంలో బాధితురాలు తల్లిదండ్రులకు చెప్పడంతో ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
News November 2, 2024
ముషీరాబాద్‌లో 2 వేల కిలోల దున్నరాజు
ముషీరాబాద్‌లో గోలు టూ దున్నరాజు ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని BRS నేత ఎడ్ల హరిబాబు యాదవ్ తెలిపారు. నారాయణగూడ సదర్ సమ్మేళనంలో ఈ దున్నరాజుని ప్రదర్శించనున్నారు. గోలు టూ 7 అడుగులకు పైగా ఎత్తు, 14 అడుగుల పొడవు, 2 వేల కిలోల బరువుతో భారీ ఆకారంలో ఉంది. సాయంత్రం ముషీరాబాద్ నుంచి నారాయణగూడ వరకు ర్యాలీగా వెళ్తారు. అక్కడి యాదవ సోదరులతో ‘అలయ్.. బలయ్’ తీసుకోనున్నట్లు హరిబాబు యాదవ్ తెలిపారు.