News January 4, 2025
శేషాచలం అడవుల్లో శ్రీకాళహస్తి బీటెక్ విద్యార్థుల మిస్సింగ్
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పరిసరాలైన శేషాచలం అడవుల్లో బీటెక్ విద్యార్థులు దారి తప్పిపోయారు. శ్రీ కాళహస్తి నుంచి వచ్చిన ఆరుగురు బీటెక్ విద్యార్థులు, అడవిలోని అందమైన వాటర్‌ఫాల్స్‌ను చూసేందుకు శుక్రవారం వచ్చారు. తిరుగు ప్రయాణంలో వారు దారితప్పి అడవిలో చిక్కుకుపోయారు. దారి తప్పిన ఆరుగురిలో ఒకరు అస్వస్థతకు గురయ్యారు. పోలీసులు గాలిస్తున్నారు.
Similar News
News January 24, 2025
చిత్తూరు ఎస్పీకి ఉత్తమ జాతీయ అవార్డు
గత అసెంబ్లీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించినందుకు చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలుకు అవార్డు వచ్చింది. ఉత్తమ ఎన్నికల నిర్వహణ జాతీయ అవార్డుకు ఆయన సెలెక్ట్ అయ్యారు. విజయవాడలో 25న జరిగే 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం సభలో ఈ అవార్డును అందుకోనున్నారు. ఎన్నికలను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించినందుకు ఎస్పీ అవార్డు వచ్చిందని పలువురు పోలీస్ అధికారులు హర్షం వ్యక్తం చేశారు.
News January 23, 2025
తిరుమలలో ముగిసిన అధ్యయనోత్సవాలు
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో గతేడాది డిసెంబరు 30వ తేదీ నుంచి అధ్యయనోత్సవాలు ప్రారంభమయ్యాయి. గురువారంతో ఈ ఉత్సవాలు ముగిశాయి. ఆలయంలోని రంగనాయకుల మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారిని వేంచేపు చేసి దివ్యప్రబంధ గోష్టి నిర్వహించారు. 25 రోజులుగా శ్రీవారి శ్రీవైష్ణవ జీయంగార్లు 12 మంది ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధ పాశురాలను గోష్ఠిగానం ద్వారా స్వామివారికి నివేదించారు.
News January 23, 2025
గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహిద్దాం: కలెక్టర్
76వ భారత గణతంత్ర వేడుకలను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఘనంగా నిర్వహిద్దామని కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. ఈ నెల 26న నిర్వహించే 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు సంబంధించి అధికారులతో వర్చువల్ గా సమావేశమయ్యారు. గణతంత్ర దినోత్సవ వేడుకలు ఈ నెల 26న పోలీసు పెరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.