News March 26, 2024
శేష వాహనంపై ఊరేగిన కదిరి శ్రీ లక్మి నరసింహుడు

కదిరి పట్టణంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో స్వామివారి బ్రహ్మోత్సవాల అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడవ రోజు శేష వాహనంపై స్వామి వారిని ఊరేగింపు నిర్వహించారు. ఆలయంలో అర్చకులు విశేష పూజలు నిర్వహించి ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం మాడవీధుల్లో ఊరేగింపు చేశారు. ఊరేగింపు సందర్భంగా భక్తులు పూజలు చెల్లించుకున్నారు.
Similar News
News April 24, 2025
ఉత్తమ అవార్డు అందుకున్న అనంతపురం కలెక్టర్

స్వచ్ఛ ఆంధ్ర (గ్రామీణ) కార్యక్రమాల అమలులో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ అవార్డును అనంతపురం జిల్లా కలెక్టర్ డా.వినోద్ కుమార్ అందుకున్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అవార్డును అందజేశారు. గత ప్రభుత్వం పంచాయతీ నిధులన్నీ నిర్వీర్యం చేసిందని పవన్ విమర్శించారు. తాను ఇష్టంతో పంచాయతీరాజ్ శాఖను తీసుకున్నానని చెప్పారు. కలెక్టర్‌ను అభినందించారు.
News April 24, 2025
ఇన్‌స్టా ప్రేమ.. మోసపోయిన అనంతపురం యువతి!

ప్రేమ పేరుతో అనంతపురం యువతిని మోసం చేసిన వ్యక్తిపై హైదరాబాద్ SR నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై శ్రీనాథ్‌రెడ్డి వివరాల మేరకు.. అనంతపురం యువతికి SR నగర్లో ఉండే మురళి ఇన్‌స్టాలో పరిచయమయ్యాడు. అది ప్రేమగా మారింది. యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు హోటల్‌కు తీసుకెళ్లాడు. పెళ్లి ప్రస్తావన తేవడంతో ముఖం చాటేశాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.
News April 24, 2025
స్వచ్ఛతలో అనంతపురం జిల్లాకు అవార్డు

స్వచ్ఛ ఆంధ్ర అమలులో అనంతపురం జిల్లాకు అవార్డు దక్కింది. రాష్ట్రంలోనే తొలి స్థానంలో అనంతపురం, ద్వితీయ స్థానంలో సత్యసాయి జిల్లా నిలిచాయి. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ కృష్ణతేజ ప్రకటించారు. నేడు విజయవాడలో జరగనున్న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంలో జిల్లా కలెక్టర్ డా.వినోద్ కుమార్ అవార్డును అందుకోనున్నారు.