News August 19, 2024

శ్రావణమాసంలో మండుతున్న ఎండలు.. అల్లాడిపోతున్న ప్రజలు

image

శ్రావణమాసం, వర్షాకాలం చల్లగా ఉండాల్సిన వాతావరణం వేసవిని తలపిస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. అధిక వేడిమి, ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. ఆదివారం నేలకొండపల్లిలో అత్యధికంగా 42.3 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. వేడిమి,ఉక్క పోత తట్టుకోలేక పగలే ఏసీలు వినియోగిస్తున్నారు. దీంతో విద్యుత్తు వినియోగం పెరుగుతోంది. జిల్లాలోని ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లలో భారీగా పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Similar News

News October 7, 2024

ఖమ్మం: నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే కేసులు: ట్రాఫిక్ ఏసీపీ

image

ఖమ్మంలో ఉద్దేశపూర్వకంగా నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని ట్రాఫిక్ ACP శ్రీనివాసులు తెలిపారు. పోలీస్ కమిషనర్ ఆదేశాలతో వాహన తనిఖీల్లో భాగంగా నంబర్ ప్లేట్ లేని 55 బైకులను ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు చెప్పారు. ప్రస్తుతం పట్టుబడిన వాహన పత్రాలు, ఛాసిస్ నంబర్లు తనిఖీ చేస్తూ చోరికి గురైన వాహనాలు ఏమైనా ఉన్నాయో లేదో పరిశీలిస్తునట్లు పేర్కొన్నారు.

News October 7, 2024

రేపు ఖమ్మం నగరంలో డిప్యూటీ సీఎం పర్యటన

image

ఖమ్మం నగరంలో మంగళవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటించనున్నట్లు స్థానిక కాంగ్రెస్ నేతలు ఓ ప్రకటనలో తెలిపారు. ముందుగా డిప్యూటీ సీఎం జిల్లా కలెక్టరేట్‌లో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాల ఎంపీడీసీఎల్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారని చెప్పారు. తదనంతరం డిప్యూటీ సీఎం బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.

News October 7, 2024

దుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేసిన ముస్లిం దంపతులు

image

ఖమ్మం రూరల్: నాయుడుపేటలో ఏర్పాటుచేసిన శ్రీ కనకదుర్గ అమ్మవారిని ముస్లిం దంపతులు షేక్ సోందు- నైదాభి దర్శించుకున్నారు. అమ్మవారికి ముస్లిం దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. హిందూ దేవత అయిన దుర్గమ్మకు పూజలు నిర్వహించిన ముస్లిం దంపతులు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారని స్థానికులు తెలిపారు. కాగా షేక్ సొందు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు.