News May 12, 2024

శ్రీకాకుళం:ఎన్నికల కోడ్.. నగదు పట్టివేత

image

ఇచ్ఛాపురం బస్టాండు ఎర్రన్నాయుడు కూడలి వద్ద వాహన తనిఖీల్లో రూ.1.17లక్షలు స్వాధనం చేసుకున్నారు. డొంకూరు గ్రామానికి చెందిన మొగలిపురి భాస్కరరావు వద్ద ఈ మొత్తం వెలుగు చూసింది. ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో ఎన్నికల అధికారులు ఉపతహసీల్దారుకు అప్పగించినట్లు పట్టణ ఎస్సై వి.సత్యనారాయణ తెలిపారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో డబ్బులకు తప్పనిసరిగా రశీదులు ఉండాలని అధికారులు స్పష్టం చేశారు.

Similar News

News November 28, 2025

సిక్కోలుపై తుఫాన్ ప్రభావం..!

image

రానున్న నాలుగు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ధాన్యం సేకరణపై తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ మేరకు ఆయన పలు అంశాలపై జిల్లా కలెక్టర్లతో గురువారం AP సచివాలయం నుంచి వీడియో సమావేశం నిర్వహించారు. వర్షాల వల్ల ధాన్యం తడవకుండా శ్రీకాకుళం జిల్లా రైతులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ స్వప్నిల్ దిన్‌కర్ పుండ్కర్ సూచించారు.

News November 28, 2025

శ్రీకాకుళం: వర్షాలపై అప్రమత్తం.. ధాన్యం సేకరణపై దృష్టి

image

రానున్న నాలుగు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ధాన్యం సేకరణపై తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ మేరకు ఆయన పలు అంశాలపై జిల్లా కలెక్టర్లతో గురువారం AP సచివాలయం నుంచి వీడియో సమావేశం నిర్వహించారు. వర్షాల వల్ల ధాన్యం తడవకుండా కలెక్టర్లు రైతులను అప్రమత్తం చేయాలన్నారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు.