News May 12, 2024

శ్రీకాకుళం:ఎన్నికల కోడ్.. నగదు పట్టివేత

image

ఇచ్ఛాపురం బస్టాండు ఎర్రన్నాయుడు కూడలి వద్ద వాహన తనిఖీల్లో రూ.1.17లక్షలు స్వాధనం చేసుకున్నారు. డొంకూరు గ్రామానికి చెందిన మొగలిపురి భాస్కరరావు వద్ద ఈ మొత్తం వెలుగు చూసింది. ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో ఎన్నికల అధికారులు ఉపతహసీల్దారుకు అప్పగించినట్లు పట్టణ ఎస్సై వి.సత్యనారాయణ తెలిపారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో డబ్బులకు తప్పనిసరిగా రశీదులు ఉండాలని అధికారులు స్పష్టం చేశారు.

Similar News

News February 13, 2025

ఎచ్చెర్ల: డిగ్రీ మూడవ సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల

image

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ మూడవ సెమిస్టర్ రెగ్యులర్,  సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను యూనివర్సిటీ డీన్ గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ పరీక్ష ఫలితాలను విద్యార్థులు జ్ఞానభూమి వెబ్సైట్లో తెలుసుకోవచ్చని సూచించారు. రీవాల్యుయేషన్‌కు రేపటి నుంచి విద్యార్థులు నమోదు చేసుకోవచ్చని తెలిపారు.

News February 13, 2025

SKLM: గుండెపోటు.. రూ. 45 వేల ఇంజెక్షన్ ఉచితం

image

గుండెపోటు వచ్చే సమయాల్లో మొదటి గంట కీలకమని జిల్లా DCHS డాక్టర్ కళ్యాణ్ బాబు తెలిపారు. గోల్డెన్ అవర్‌లో రోగికి ఇచ్చే టెనెక్టివ్ ప్లస్ ఇంజెక్షన్ జిల్లాలో 15 చోట్ల అందుబాటులో ఉందన్నారు. రూ.45వేల విలువైన ఈ ఇంజెక్షన్ ఫ్రీగా అందించనున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆసుపత్రితో పాటు టెక్కలి, నరసన్నపేట, పలాస, సోంపేట, ఇచ్ఛాపురం, బారువ, మందస, కవిటి, హరిపురం, కోటబొమ్మాళి, పాతపట్నం, బుడితి, రణస్థలం, ఆమదాలవలసలలో ఉంది.

News February 13, 2025

శ్రీకాకుళంలో బర్డ్ ఫ్లూ కేసు నమోదు కాలేదు: రాజగోపాలరావు

image

నేటి వరకు శ్రీకాకుళం జిల్లాలో ఒక్క బర్డ్ ఫ్లూ వైరస్ కేసులు నమోదు కాలేదని పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డా.కె.రాజగోపాలరావు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు ఈ వ్యాధి లక్షణాలతో కోళ్లు మృతి చెందలేదని అన్నారు. జిల్లాలోని ప్రతి కోళ్ల ఫారంలు తనిఖీ చేయడానికి 68 రాపిడ్ యాక్షన్ టీమ్‌లు ఏర్పాటు చేశామని చెప్పారు. కోళ్ల పెంపకందారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

error: Content is protected !!