News July 7, 2024
శ్రీకాకుళంలో అతిపెద్ద జగన్నాథ రథం ఇక్కడే

పాలకొండ పట్టణంలోని జగన్నాథ ఆలయానికి 600 ఏళ్ల చరిత్ర ఉంది. ఒడిశాకి చెందిన జైపూర్ రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ ఏటా రథయాత్ర ఉత్సవాలు ఒడిశా సంప్రదాయంలోనే నిర్వహిస్తారు. ఇక్కడి జగన్నాథ రథం జిల్లాలోనే అతిపెద్దది. ఉత్తరాంధ్ర, ఒడిశా భక్తులు కూడా స్వామివారి ఉత్సవాలలో పాల్గొంటారు. పూరీ తర్వాత అంతటి నిష్ఠతో ఏటా తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు వేల మంది భక్తులు హాజరవుతారు.
Similar News
News November 28, 2025
సిక్కోలుపై తుఫాన్ ప్రభావం..!

రానున్న నాలుగు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ధాన్యం సేకరణపై తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ మేరకు ఆయన పలు అంశాలపై జిల్లా కలెక్టర్లతో గురువారం AP సచివాలయం నుంచి వీడియో సమావేశం నిర్వహించారు. వర్షాల వల్ల ధాన్యం తడవకుండా శ్రీకాకుళం జిల్లా రైతులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ స్వప్నిల్ దిన్‌కర్ పుండ్కర్ సూచించారు.
News November 28, 2025
శ్రీకాకుళం: వర్షాలపై అప్రమత్తం.. ధాన్యం సేకరణపై దృష్టి

రానున్న నాలుగు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ధాన్యం సేకరణపై తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ మేరకు ఆయన పలు అంశాలపై జిల్లా కలెక్టర్లతో గురువారం AP సచివాలయం నుంచి వీడియో సమావేశం నిర్వహించారు. వర్షాల వల్ల ధాన్యం తడవకుండా కలెక్టర్లు రైతులను అప్రమత్తం చేయాలన్నారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు.