News July 7, 2024

శ్రీకాకుళంలో అతిపెద్ద జగన్నాథ రథం ఇక్కడే

image

పాలకొండ పట్టణంలోని జగన్నాథ ఆలయానికి 600 ఏళ్ల చరిత్ర ఉంది. ఒడిశాకి చెందిన జైపూర్ రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ ఏటా రథయాత్ర ఉత్సవాలు ఒడిశా సంప్రదాయంలోనే నిర్వహిస్తారు. ఇక్కడి జగన్నాథ రథం జిల్లాలోనే అతిపెద్దది. ఉత్తరాంధ్ర, ఒడిశా భక్తులు కూడా స్వామివారి ఉత్సవాలలో పాల్గొంటారు. పూరీ తర్వాత అంతటి నిష్ఠతో ఏటా తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు వేల మంది భక్తులు హాజరవుతారు.

Similar News

News December 10, 2024

రణస్థలం: రెండు బైకులు ఢీ వ్యక్తి మృతి

image

రణస్థలంలోని పాత పెట్రోల్ బంకు సమీపంలో రెండు బైకులు ఢీకొనడంతో ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఎస్సై చిరంజీవి తెలిపిన వివరాల మేరకు జె.ఆర్‌పురంలో నివాసం ఉంటున్న విశ్రాంత ఉద్యోగి తలసముద్రపు పాటయ్య(67) బంకులో పెట్రోల్ కొట్టేందుకు బైక్‌పై సోమవారం వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో లావేరు రోడ్డుకు వస్తుండగా మరో ద్విచక్రవాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో పాటయ్యను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.

News December 10, 2024

దువ్వాడ శ్రీనివాస్‌పై ఒంగోలు PSలో ఫిర్యాదు

image

పవన్ కళ్యాణ్‌ని తమ రాజకీయ లబ్ధికోసం, జగన్ వద్ద మెప్పు పొందేందుకు అసభ్యకరమైన పదజాలంతో పోస్టులు పెట్టిన వైసీపీ నాయకులపై తగు చర్యలు తీసుకోవాలని, ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గొర్రెపాటి అర్జునరావు అన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు, శ్రీరెడ్డి, మాజీ మంత్రి జోగి రమేశ్, పోసాని కృష్ణమురళిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

News December 10, 2024

మందస వద్ద పులి అడుగు జాడలు

image

పలాస నియోజకవర్గం మందస మండలం చీపి ప్రాంతంలో పులి అడుగు జాడలు ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు. సోమవారం ఈ అడుగులు ఉన్నట్లు గమనించారు. ఇటీవలే ఒడిశా ప్రాంతం నుంచి ఆంధ్ర సరిహద్దుల్లోకి పులి ప్రవేశించిందంటూ ఒడిశా అధికారులు, స్థానిక అధికారులు సమాచారం అందించారు. దీని పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు.