News February 16, 2025

శ్రీకాకుళంలో ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయం..!

image

శ్రీకాకుళం జిల్లాకు ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయం వస్తుందని ఎమ్మెల్యే గొండు శంకర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో రైతాంగానికి ఎంతో మేలు కలుగుతుందని ఆయన అన్నారు. ఇది వరకూ ఈ కార్యాలయం బొబ్బిలిలో ఉండేదని చెప్పారు. శ్రీకాకుళంలో ఏర్పాటు చేసేందుకు రాష్ర్ట మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కృషి ఎంతో ఉందని అన్నారు. రైతాంగానికి అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందన్నారు. 

Similar News

News February 22, 2025

SKLM : విద్యార్థిని అశ్లీల చిత్రాలతో వ్యాపారం.. నిందితుల అరెస్టు

image

విద్యార్థిని వీడియోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి, పోర్న్ సైట్లలో సొమ్ము చేసుకుంటున్న ఇద్దిరిని శ్రీకాకుళం పోలీసులు అరెస్ట్ తెలిపారు. నగరానికి చెందిన ఓ విద్యార్థిని తిరుపతిలో చదువుతున్న సమయంలో సోయల్‌ పరిచయమయ్యాడు. ఆమెకు తెలియకుండా తీసిన వీడియోలను మార్ఫింగ్ చేసి, కొత్త నంబర్లతో పంపుతూ వేధించేవాడు. ఆ వీడియోలు చూసేందుకు సోయల్ నుంచి క్యూఆర్ కొనుగోలు చేసిన నందికొట్కూరుకు చెందిన రఘును కూడా అరెస్టు చేశారు.

News February 22, 2025

SKLM: గ్రూప్-2 సర్వీసెస్ పరీక్షలకి సమయపాలన తప్పనిసరి

image

ఈ నెల 23న జరగనున్న గ్రూప్-2 పరీక్షలకు అభ్యర్థులంతా సమయపాలన పాటించాలని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 15 పరీక్షా కేంద్రాల్లో జరుగుతాయన్నారు. శ్రీకాకుళం మండలం – 8, ఎచ్చెర్ల మండలం – 7గా కేటాయించారు. ఈ పరీక్షలు రెండు సెషన్లలో జరుగుతాయని వెల్లడించారు. ఉదయం 10 నుంచి 12.30, మధ్యాహ్నం 3 నుంచి 5.30 వరకు పరీక్షలు ఉంటాయన్నారు.

News February 22, 2025

శ్రీకాకుళం: జిల్లాను ప్రగతి పథంలో తీసుకువెళ్లాలి

image

జిల్లాను ప్రగతి పథంలో తీసుకెళ్లేందుకు అందరూ సమష్టిగా పనిచేయాలని జిల్లా పరిషత్ చైర్ పర్సన్, స్థాయి సంఘాల అధ్యక్షురాలు పిరియా విజయ అన్నారు. శుక్రవారం ఉదయం శ్రీకాకుళం పట్టణంలోని జడ్పీ కార్యాలయంలో 2వ, 4వ, 7వ స్థాయి సంఘాల సమావేశం జరిగింది. జిల్లా అభివృద్ధిలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు హాజరయ్యారు.

error: Content is protected !!