News February 16, 2025
శ్రీకాకుళంలో ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయం..!

శ్రీకాకుళం జిల్లాకు ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయం వస్తుందని ఎమ్మెల్యే గొండు శంకర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో రైతాంగానికి ఎంతో మేలు కలుగుతుందని ఆయన అన్నారు. ఇది వరకూ ఈ కార్యాలయం బొబ్బిలిలో ఉండేదని చెప్పారు. శ్రీకాకుళంలో ఏర్పాటు చేసేందుకు రాష్ర్ట మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కృషి ఎంతో ఉందని అన్నారు. రైతాంగానికి అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందన్నారు.
Similar News
News March 23, 2025
ఎచ్చెర్ల రోడ్డు ప్రమాదంలో టెక్నీషియన్ మృతి

ఎచ్చెర్ల హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీకాకుళం పట్టణానికి చెందిన దేశరాజ వెంకట కిరణ్ కుమార్(40) ఆదివారం ఎచ్చెర్ల కేశవరెడ్డి స్కూల్ వద్ద జంక్షన్ దాటుతుండగా రాజాం నుంచి వస్తున్న క్యాబ్ ఢీకొంది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఎచ్చెర్లలో రూమ్ తీసుకొని రణస్థలం ప్రభుత్వాసుపత్రి CHCలో టెక్నీషియన్‌గా చేస్తున్నాడు. ఎస్సై సందీప్ కేసు నమోదు చేశారు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.
News March 23, 2025
ఎచ్చెర్ల: ఆరుగురిపై క్రిమినల్ కేసులు

కుప్పిలి ఆదర్శ పాఠశాల విద్యార్థుల మాస్ కాపీయింగ్‌కు ఉపాధ్యాయులు సహకరించారని శ్రీకాకుళం డీఈఓ తిరుమల చైతన్య ఎచ్చెర్ల పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఆరుగురు ఉపాధ్యాయులతోపాటు మరికొందరి పాత్ర ఉందని డీఈఓ ఫిర్యాదు చేయగా ఎఫ్ఎఆర్‌లో వారి పేర్లు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ. సందీప్ కుమార్ చెప్పారు.
News March 23, 2025
ఎచ్చెర్ల: టెన్త్ చూచిరాతలో సీనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్

ఎచ్చెర్ల మండలం కుప్పిలి ఏపీ మోడల్ హైస్కూల్ ఏ, బీ కేంద్రాల్లో పదో తరగతి పరీక్షల్లో చూచిరాతల్లో సీనియర్ అసిస్టెంట్ కిషోర్‌ను జిల్లా విద్యాశాఖధికారి తిరుమల చైతన్య సస్పెండ్ చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మార్చి 21న స్థానికులు ఫిర్యాదు మేరకు 14 మంది ఉపాధ్యాయులను సస్పెండ్ చేసిన సంఘటన “Way2News” లో వెలువడిన సంగతి తెలిసిందే.