News July 17, 2024
శ్రీకాకుళంలో ఈ నెల 19న జాబ్ మేళా

శ్రీకాకుళంలోని బలగ ప్రభుత్వ DLTC, ITI లో ఈ నెల 19న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కొత్త లంక సుధా ఓ ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళాలో రెండు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగుల కోసం ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నామన్నారు. పదో తరగతి ఆపై విద్యా అర్హతలు ఉన్న నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Similar News
News October 21, 2025
శ్రీకాకుళం: ‘RTCలో 302 మందికి ప్రమోషన్లు’

శ్రీకాకుళం APRTC డివిజన్ పరిధిలో 23 కేటగిరిల్లో విధులు నిర్వహిస్తున్న 302 మందికి ప్రమోషన్లు కల్పిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి సీహెచ్ అప్పలనారాయణ వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సీఎం ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆదివారం, సోమవారం ప్రమోషన్ ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తామని ఆయన తెలియజేశారు. రెండు, మూడు రోజుల్లో జాబితా ప్రకటిస్తామని ఆయన వివరించారు.
News October 20, 2025
శ్రీకాకుళం మీదుగా స్పెషల్ ట్రైన్స్

అదనపు రద్దీని తగ్గించేందుకు భువనేశ్వర్-యశ్వంతపూర్-భువనేశ్వర్(02811/22) మధ్య స్పెషల్ ట్రైన్ ఈనెల 29వ తేదీ వరకు నడపనున్నట్లు తూర్పు ప్రాంత రైల్వే శాఖ జనరల్ మేనేజర్ పరమేశ్వర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. విశాఖపట్నం-బెంగళూరు-విశాఖపట్నం(08581/82) మధ్య ఈనెల 30వ తేదీ వరకు రైళ్లు నడుస్తాయి. శ్రీకాకుళంరోడ్డు, పలాస స్టేషన్లతో పాటు రాజమండ్రి, విజయవాడ, నెల్లూరులో ఈ రైళ్లు ఆగుతాయి.
News October 20, 2025
SKLM: డిగ్రీ పరీక్షలకు నోటిఫికేషన్ విడుదల

శ్రీకాకుళం జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ డిగ్రీ 6వ సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షల నోటిఫికేషన్ విడుదలైది. ఈ మేరకు యూనివర్సిటీ డిగ్రీ పరీక్షల విభాగం అధికారి జి.పద్మారావు ఓ ప్రకటన విడుదల చేశారు. అభ్యర్థులు ఈనెల 31వ తేదీ లోపు పరీక్ష ఫీజును యూనివర్సిటీ లేదా కాలేజీల్లో చెల్లించాలని సూచించారు. పరీక్షలు నవంబర్ 25వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయని చెప్పారు.