News January 5, 2025

శ్రీకాకుళంలో జనవరి 7న జాబ్ మేళా

image

శ్రీకాకుళం బలగ ప్రభుత్వ డీఎల్ టీసీ/ ఐటీఐ కాలేజ్‌లో జనవరి 7న ఏపీ నైపుణ్యా శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యా అధికారి యు. సాయికుమార్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళా ద్వారా పలు కంపెనీల్లో 75 పోస్టులు భర్తీ చేయనున్నారు. SSC, INTER పూర్తిచేసిన 18-35 ఏళ్ల కలిగిన M/F అభ్యర్థులు అర్హులని అన్నారు. ఈ అవకాశం నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

Similar News

News January 8, 2025

మెళియాపుట్టిలో సినిమా షూటింగ్ సందడి

image

మెళియాపుట్టి పరిసర ప్రాంతాల్లో బుధవారం సినిమా షూటింగ్ సందడి నెలకొంది. ఎస్ఎస్ క్రియేషన్స్ బ్యానర్‌పై తీస్తున్న సినిమా చిత్రీకరణ మండలంలోని కరజాడలో బుధవారం జరిగింది. హీరో, హీరోయిన్లుగా గోపాల్ రెడ్డి, శృతి, ప్రధాన పాత్రల్లో డా.కుమార్ నాయక్, ఆశిష్ చోటు ఉన్నారని సినిమా దర్శకుడు శివశంకర్ తెలిపారు. వీరితో పాటు నిర్మాత స్వాతి ఉన్నారు. ఈ సినిమా తెలుగు, హిందీ, ఒడియా మూడు భాషల్లో విడుదల కానుంది.

News January 8, 2025

శ్రీకాకుళం: మోదీ సభా స్థలి ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి అచ్చెన్న

image

విశాఖపట్నంలో భారత్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో బుధవారం ఉదయం నగరంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం మైదానంలో జరుగుతున్న సభ ఏర్పాట్లను టెక్కలి ఎమ్మెల్యే, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఎచ్చెర్ల టీడీపీ నాయకులు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పర్యవేక్షించారు. పలువురు అధికారులతో వారితో మాట్లాడి సూచనలు చేశారు.

News January 8, 2025

మకరాంపురం యువకుడికి రెండు బ్యాంక్ ఉద్యోగాలు

image

కంచిలి మండలం మకరాంపురం గ్రామానికి చెందిన తమరాల అవినాశ్‌కి ఒకేసారి రెండు బ్యాంక్ ఉద్యోగాలు సాధించి సత్తా చాటారు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో కెనరా బ్యాంక్, ఏపీజీవీబీ పీఓ ఉద్యోగాలు సాధించినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు సాధారణ కుటుంబ నేపథ్యం గల యువకుడు ఒకేసారి రెండు బ్యాంక్ ఉద్యోగాలు సాధించడంపై కుటుంబసభ్యులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.