News August 9, 2024

శ్రీకాకుళంలో జాబ్ మేళా.. 53 మంది ఎంపిక

image

శ్రీకాకుళం నగరంలోని స్థానిక ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో జిల్లా ఉపాధి కల్పనాధికారి సుధా ఆధ్వర్యంలో శుక్రవారం జాబ్‌మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో రెండు ప్రైవేట్ కంపెనీల యాజమాన్యాలు ఇంటర్వ్యూ నిర్వహించగా.. నిరుద్యోగ యువత 70 మంది హాజరయ్యారు. ఇందులో 53 మందికి ఎంపిక చేసి ఉపాధి కల్పించినట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి తెలిపారు.

Similar News

News September 12, 2024

శ్రీకాకుళం: విజిలెన్స్ ఎస్పీగా ప్రసాదరావు బాధ్యతల స్వీకరణ

image

శ్రీకాకుళం జిల్లా విజిలెన్స్ ఎస్పీగా బర్ల ప్రసాదరావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం విజిలెన్స్ ఎస్పీ సురేష్ బాబు నుంచి పదవీ బాధ్యతలు తప్పకున్నారు. అనంతరం జిల్లా స్థాయి విజిలెన్స్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎస్పీకి పలువురు అభినందనలు తెలియజేశారు.

News September 12, 2024

శ్రీకాకుళం: దసరా,దీపావళికి ప్రత్యేక రైళ్లు

image

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే దసరా, దీపావళి ఫెస్టివల్స్‌కు శ్రీకాకుళం నుంచి తిరుపతికి (07443), తిరుపతి నుంచి శ్రీకాకుళానికి (07442) ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు ద.మ రైల్వే అధికారులు ఓ ప్రకటనలో గురువారం తెలిపారు. 07443 రైలు అక్టోబర్ 7 నుంచి నవంబర్ 11 వరకు నడుస్తుందన్నారు. 07442 రైలు అక్టోబర్ 06 నుంచి నవంబర్ 10 వరకు నడుస్తుందని..ప్రయాణికులు గమనించాలని కోరారు.

News September 12, 2024

సోంపేట: అదుపుతప్పి పంటపొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

image

శ్రీకాకుళం నుంచి ఇచ్ఛాపురం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు గురువారం అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకుపోయింది. 20 మంది ప్రయాణీకులతో శ్రీకాకుళం నుంచి బయలుదేరిన బస్సు సోంపేట మండలం మామిడిపల్లి గ్రామం సమీపంలో ఒక్కసారిగా అదుపుతప్పింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ప్రయాణీకులకు ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఘటనకు గల కారణాలు తెలియరాలేదు.