News March 11, 2025

శ్రీకాకుళంలో నిండు గర్భిణి మృతి..ప్రమాదం ఎలా జరిగిందంటే

image

ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ నిండు గర్భిణి మృతి చెందిన ఘటన శ్రీకాకుళంలో జరిగిన విషయం తెలిసిందే. ఎచ్చెర్ల (M) కుంచాలకూర్మయ్యపేటకు చెందిన దుర్గరావు భార్య రాజేశ్వరి నిండు గర్భిణి. సోమవారం ప్రభుత్వాసుపత్రికి వెళ్లి ఇంటికి బైక్‌పై వెళ్తుండగా డే అండ్ నైట్ కొత్త జంక్షన్ వద్ద వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొంది. భర్తపై బైక్ పడిపోగా, ఆమె తొడ భాగంపై నుంచి బస్సు వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది.

Similar News

News December 3, 2025

బూర్జలో 6 తులాల బంగారం, 23 తులాల వెండి చోరీ

image

శ్రీకాకుళం జిల్లాలో మరోసారి దొంగలు రెచ్చిపోయారు. బూర్జలోని ఓ ఇంటిలో సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. పోలీసుల వివరాల మేరకు.. శనివారం సాయంత్రం స్థానికుడు రమేష్ కుటుంబంతో కలిసి అరకు వెళ్లారు. మంగళవారం ఉదయం తిరిగొచ్చేసరికి ఇంటి తాళాలు, బీరువా తెరిచి ఉన్నాయి. 6 తులాల బంగారం, 23 తులాల వెండి, రూ.1లక్ష నగదు చోరీకి గురైనట్లు గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

News December 3, 2025

SKLM: ‘ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఈ-ఆఫీస్ తప్పనిసరి’

image

వచ్చే వారానికి జిల్లాలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఈ-ఆఫీసు వ్యవస్థను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వ పరంగా వివిధ శాఖల దస్త్రాలపై సమీక్ష నిర్వహించారు. ఆర్థికపరమైన దస్త్రాల పరిష్కారంలో చొరవ చూపాలన్నారు. ఈ విషయంలో వెనుకబడిన అధికారులుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

News December 2, 2025

ఉత్తరాంధ్రలో పెరిగిన కాలుష్యం

image

ఉత్తరాంధ్రలోని మూడు నగరాల్లో కాలుష్యం పెరిగింది. సోమవారం జరిగిన లోక్‌సభ సమావేశంలో హిందూపూరం MP పార్థసారథి అడిగిన ప్రశ్నకి కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ సమాధానం ఇచ్చారు. 2017-18తో పోలిస్తే 2024-25లో ఉత్తరాంధ్రలో గాలి నాణ్యత మరింత దిగజారింది. ఉమ్మడి విశాఖ, శ్రీకాకుళంలో పరిశ్రమలు వ్యర్థాలను సరిగ్గా శుద్ధి చేయకపోవడం వల్ల కాలుష్యం పెరిగిందని నిపుణులు చెబుతున్నారు.