News July 5, 2024

శ్రీకాకుళంలో పని చేయడం మధుర జ్ఞాపకం: కలెక్టర్‌ జిలాని

image

శ్రీకాకుళం జిల్లాలో పనిచేయడం తన కెరియర్‌‌లో ఒక మధుర జ్ఞాపకంగా ఉంటుందని బదిలీపై వెళ్తున్న కలెక్టర్ మనజీర్ జిలాని సమూన్ అన్నారు. ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో గురువారం సాయంత్రం జిల్లా అధికార బృందం ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికింది. ఆయన మాట్లాడుతూ.. తన విధులలో ఒక్కసారి అయినా జిల్లా ఎన్నికల అధికారిగా పనిచేసి సమర్థవంతంగా, ప్రశాంతంగా నిర్వహించాలనే కల ఇక్కడ నెరవేరడం ఎంతో సంతృప్తినిచ్చిందని చెప్పారు.

Similar News

News February 23, 2026

శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

image

➤పలాస:గూడ్స్ రైలుకు తప్పిన పెనుప్రమాదం
➤శ్రీకాకుళంలో ప్రబలిన డయేరియా
➤శ్రీకాకుళం: ఎస్పీ గ్రీవెన్స్ కు 51 వినతులు
➤ఇచ్ఛాపురం: ఏసీబీ వలలో ఎంఈఓ
➤జిల్లాలో పలుచోట్ల అంగన్వాడీల నిరసన
➤శ్రీకాకుళం: ఇంటర్ పరీక్షకు 662 మంది గైర్హాజరు
➤టెక్కలి: ఆటో-బైక్ ఢీ..ఆరుగురికి గాయాలు
➤జిల్లా వ్యాప్తంగా ఎర్రన్నాయుడు జయంతి కార్యక్రమాలు

News February 23, 2026

డయేరియా అదుపునకు అత్యవసర చికిత్స అందించాలి: రామ్మోహన్

image

శ్రీకాకుళంలో డయారేయా కేసుల ఉద్ధృతిపై జిల్లా అధికారులతో మాట్లాడిన కేంద్రమంత్రి రామ్మోహన్ సోమవారం అత్యవసరంగా సమీక్షించారు. రోగులకు అత్యవసర చికిత్స అందించి, వ్యాధి ప్రబలకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి వ్యాధి సోకడానికి గల కారణాలు అన్వేషించాలని ఆయన సూచించారు. నగరపాలక సంస్థ ప్రజారోగ్య సిబ్బంది, అధికారులు క్షేత్ర స్థాయిలో నిరంతరo అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

News February 23, 2026

SKLM: ‘జాతీయ లోక్ అదాలత్‌ను వినియోగించుకోవాలి’

image

మార్చి 14న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌ను వినియోగించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికారి సంస్థ ఛైర్మన్ జూనైద్ అహమ్మద్ మౌలానా పేర్కొన్నారు. సోమవారం జిల్లా కోర్టులో పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న అత్యధికంగా కేసులు రాజీ చేసేందుకు అధికారులు ప్రయత్నం చేయాలని సూచించారు. మోటర్ యాక్సిడెంట్ కేసుల్లో ఇన్సూరెన్స్ సంస్థలు త్వరితగతిన న్యాయం చేయాలన్నారు. ASP రమణ ఉన్నారు.