News November 27, 2024
శ్రీకాకుళంలో పెన్షన్ ఒకరోజు ముందే అందజేత

శ్రీకాకుళం జిల్లా వాసులకు ప్రభుత్వం పెన్షన్ పంపిణీలో శుభవార్త చెప్పింది. ఈ సందర్భంగా జిల్లాలో ఉండే పెన్షన్ దారులకు ఈనెల 30వ తేదీనే పెన్షన్ అందజేయనుంది. డిసెంబర్ 1వ తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పెన్షన్ లబ్ధిదారులకు సచివాలయ సిబ్బంది అందజేయనున్నారు. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉండే 3.14 లక్షల మంది పెన్షన్ దారులు ఉండగా వారందరికీ ప్రభుత్వం పెన్షన్ ఒక రోజు ముందుగానే అందజేయాలని నిర్ణయించింది.
Similar News
News December 18, 2025
శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

☞పలాస ఎమ్మెల్యే శిరీషను కలిసిన ఆర్.నారాయణమూర్తి
☞సైకిల్ తొక్కిన ఎమ్మెల్యే బగ్గు
☞శ్రీకాకుళం: డ్యూటీల పేరుతో మహిళా ఉపాధ్యాయులను వేదిస్తున్నారు
☞SKLM: ఈనెల 30న శ్రీకాకుళంలో తపాలా అదాలత్
☞రణస్థలం: ‘తాగునీటి సమస్యను పరిష్కరిస్తాం’
☞ట్రక్ షీట్ల జారీపై జిల్లా జాయింట్ కలెక్టర్ సూచనలు
☞జిల్లాలో పలుచోట్ల ధనుర్మాసం పూజలు, నగర సంకీర్తనలు
News December 18, 2025
రామ్మోహన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు పుట్టినరోజు శుభాకాంక్షలు గురువారం రాత్రి తెలిపారు. దిల్లీ విమానాశ్రయంలోనే పలువురు కేంద్ర మంత్రుల మధ్య చంద్రబాబు కేక్ కట్ చేయించి రామ్మోహన్ నాయుడుకు తినిపించారు. సీఎం రెండు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రాభివృద్ధికి సంబంధించి పలువురు కేంద్ర మంత్రులను కలిసిన సంగతి విధితమే.
News December 18, 2025
శ్రీకాకుళం: ట్రక్ షీట్ల జారీపై జేసీ సూచనలు

ధాన్యం కొనుగోలులో భాగంగా రైతు సేవా కేంద్రాల్లో జారీ చేస్తున్న ట్రక్ షీట్లపై శ్రీకాకుళం జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ బుధవారం కీలక సూచనలు చేశారు. రాత్రి 7 నుంచి ఉదయం 5 లోపు ట్రక్ షీట్లను జారీ చేయొద్దని సిబ్బందికి సూచించారు. మెలియాపుట్టి మండలం పెద్దలక్ష్మీపురం RSK పరిధిలో బుధవారం వేకువజామున 3 గంటలకు 10 ట్రక్ షీట్లు ఇవ్వడంపై కోసమాల, నందిగం, సోంపేట PACS పరిధిలో నలుగురు డేటా ఎంట్రీ ఆపరేటర్లను తొలగించారు.


