News April 5, 2024

శ్రీకాకుళంలో భానుడి భగ భగ

image

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా శుక్రవారం భానుడు భగభగమంటూ నిప్పులు చెరుగుతున్నాడు. ఎండతీవ్రతకు పట్టణంతో పాటుగా ఆమదాలవలస, రణస్థలం, ఎచ్చెర్ల, చిలకపాలెం, టెక్కలి, రాజాం, పొందూరు ప్రధాన రహదారులపై జనసంచారం పలుచబడింది. ఎండ వేడిమికి వృద్ధులు, పిల్లలు, వాహనదారులు అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Similar News

News January 20, 2025

కూటమి ప్రభుత్వంపై అక్కసుతో దుష్ప్రచారం: అచ్చెన్న

image

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక కొంత మంది వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు కర్మాగారానికి కేంద్రం ఆర్థిక సహాయం అందించడంపై ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అసత్య ప్రచారం చేస్తున్నారని, ఉక్కుకర్మాగారం ఊపిరి తీసింది మాజీ సీఎం వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఆయన విమర్శించారు. 

News January 20, 2025

పాతపట్నం: ఇంట్లోకి చొరబడి.. వైసీపీ కార్యకర్తపై దాడి

image

పాతపట్నం మేజర్ పంచాయతీ దువ్వారి వీధికి చెందిన పెద్దింటి తిరుపతిరావు పై హత్య ప్రయత్నం జరిగింది. తిరుపతి నిద్రిస్తుండగా రాత్రి 3 గంటల సమయంలో (ఆదివారం రాత్రి తెల్లవారితే సోమవారం) గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడి కత్తితో మెడ పైన దాడి చేయడం జరిగింగి. తిరుపతిరావు ఓ పత్రిక రిపోర్టర్‌గా పనిచేస్తున్నాడు. వైసీపీ కార్యకర్తగా ఉండడంతో అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News January 20, 2025

శ్రీకాకుళం: వివాహిత హత్య.. పరిశీలించిన ఎస్పీ

image

శ్రీకాకుళం రెండో పోలీసు స్టేషన్ పరిధిలో గల న్యూ కాలనీలో ఆదివారం రాత్రి సమయంలో పూజారి కళావతి అనే ఆమె హత్యకు గురైంది. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి హత్య ప్రదేశాన్ని ఆదివారం అర్ధరాత్రి హుటాహుటిన సందర్శించి బాధితులతో హత్య ఘటనకు కారణాలు ఆరా తీశారు. అదేవిధంగా నేర ప్రదేశాన్ని క్షుణ్నంగా పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేశామని ఆయన స్పష్టం చేశారు.