News May 27, 2024

శ్రీకాకుళంలో ముమ్మరంగా కార్డెన్ సెర్చ్

image

శ్రీకాకుళంలో జిల్లా వ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్పీ రాధిక ఆదేశాల మేరకు సోమవారం పోలీస్ స్టేషన్ల పరిధిలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైల ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎవరూ కూడా ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో అల్లర్లు సృష్టించరాదని సూచించారు. దీనిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Similar News

News October 2, 2024

శ్రీకాకుళం జిల్లాలో నేటి నుంచి దసరా సెలవులు

image

శ్రీకాకుళం జిల్లాలోని అన్ని పాఠశాలలకు అక్టోబర్ 2 (బుధవారం) నుంచి 13వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డా. తిరుమల చైతన్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఈ దసరా సెలవుల్లో… బీచ్ లకు వెళ్లకుండా చూసుకోవాలన్నారు. అలాగే వారికి బైకు ఇవ్వరాదని దానివల్ల ప్రమాదాలు ఉంటాయని సూచించారు.

News October 2, 2024

ఆమదాలవలస: మహాత్మా గాంధీ నాటిన మొక్క నేడు మహా వృక్షం

image

క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో ఉద్యమకారుల్లో స్ఫూర్తి నింపేందుకు మహాత్మా గాంధీ ఆమదాలవలస మండలం దూసి రైల్వే స్టేషన్‌కు 1942లో చేరుకున్నారు. అక్కడ రైల్వే స్టేషన్‌లో దిగి సమరయోధులతో స్వాతంత్ర్య కాంక్షపై మాట్లాడారు. అనంతరం ఒక మర్రి మొక్కను నాటారు. నేడు అది మహావృక్షంగా మారింది. ఈ వృక్షానికి 82 ఏళ్లు వయసైందని దూసి గ్రామస్థులు చెబుతున్నారు.

News October 2, 2024

స్వర్ణాంధ్ర విజన్‌లో భాగస్వామ్యం కావాలి: కలెక్టర్

image

స్వర్ణాంధ్ర విజన్ రూపకల్పనలో ప్రజలందరూ భాగస్వాములై తమ అభిప్రాయాలను తెలపాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ కోరారు. స్వర్ణాంధ్ర-2047 విజన్ ప్రణాళికను రూపొందించడంలో రాష్ట్రంలోనే శ్రీకాకుళం జిల్లా తొలిస్థానంలో నిలిచిందన్నారు. ఇంకా సమయం ఉన్నందున స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనకు అవసరమైన సలహాలు సూచనలు అందించాలని అన్ని వర్గాలను కోరుతున్నట్లు చెప్పారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌ సమావేశమందిరంలో మాట్లాడారు.