News September 8, 2024

శ్రీకాకుళంలో రేపు విద్యా సంస్థలకు సెలవు

image

శ్రీకాకుళం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జిల్లాలోని కళాశాలకు, అన్ని విద్యా సంస్థలకు సోమవారం కలెక్టర్ దినకర్ సెలవు ప్రకటించారు. వర్షాలు సోమవారం కూడా కురిసే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఆదేశాలను ఎవరూ పాటించక పోయిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు.

Similar News

News July 9, 2025

రేపు జిల్లా స్థాయి సబ్ జూనియర్ బాక్సింగ్ పోటీలు

image

శ్రీకాకుళం జిల్లా స్థాయి సబ్ జూనియర్ బాక్సింగ్ పోటీలను రేపు కోడి రామ్మూర్తి స్టేడియంలో నిర్వహించనున్నట్లు జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి బి.లక్ష్మణ్ దేవ్ ప్రకటించారు. ఆండర్-13, 14 విభాగాల్లో సత్తాచాటిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. 2011-12 సంవత్సరాల మధ్య జన్మించిన క్రీడాకారులు పోటీలకు అర్హులని తెలిపారు.

News July 9, 2025

కిక్కిరిసిన పలాస-ఆమదాలవలస ట్రైన్

image

పలాస-ఆమదాలవలస ప్యాసింజర్ రైలు బుధవారం ప్రయాణికులతో సంద్రాన్ని తలపించింది. సింహాచలం గిరి ప్రదర్శన సందర్భంగా లక్షలాది మంది ప్రజలు సింహాచలం తరలి రావడంతో రైలు ప్రయాణికులతో కిటకిటలాడింది. ట్రైన్‌లో కనీసం కాలు పెట్టుకునేందుకు కూడా చోటు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడ్డామన్నారు. ఇలాంటి సమయాల్లో ప్రభుత్వం స్పెషల్ ట్రైన్స్ వేయాలని కోరారు.

News July 9, 2025

శ్రీకాకుళం: 22 పీఏసీఎస్ సంఘాలకు ఛైర్మన్ల నియామకం

image

శ్రీకాకుళం జిల్లాలో 22 పీఏసీఎస్ (ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలు)కు ఛైర్మన్‌లను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు విడుదల చేసింది. జిల్లాలో 36 పీఏసీఎస్ సంఘాలు ఉండగా 22 పీఏసీఎస్ సంఘాలకు ఛైర్మన్ల నియామకం పూర్తయింది. వీరు వచ్చే ఏడాది జూలై 30వ తేదీ వరకు కొనసాగుతారు. ఒక పీఏసీఎస్ సంఘానికి ఛైర్మన్‌తో పాటు ఇద్దరు సభ్యులను నియమించారు.