News October 14, 2024
శ్రీకాకుళంలో 113 మద్యం షాపుల పేర్ల ప్రకటన
శ్రీకాకుళం నగరంలోని డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కళావేదిలో ప్రారంభమైన మద్యం షాపులు కేటాయింపులో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ డి.శ్రీకాంత్ రెడ్డి, ఆర్డీవో కె.సాయి ప్రత్యూషలు లాటరీ నిర్వహణ చేపట్టారు. ఇప్పటి వరకు 113 మద్యం షాపుల పేర్లు లాటరీ పద్ధతిలో ప్రకటించినట్లు వారు తెలిపారు.
Similar News
News November 13, 2024
టెక్కలి ఏఎస్ఐపై సస్పెన్షన్ వేటు
టెక్కలి పోలీస్ స్టేషన్‌లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న టి నర్సింగరావును సస్పెండ్ చేస్తూ మంగళవారం జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ఒక గ్రానైట్ క్వారీ సూపర్‌వైజర్ నుంచి రూ.5వేలు లంచం తీసుకున్నారని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు అందింది. ఈ విషయంపై సమగ్ర విచారనకు ఆదేశించారు. విచారణలో లంచం తీసుకున్నట్లు నిర్ధారణ కావడంతో ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు.
News November 13, 2024
శ్రీకాకుళంలో ఫీల్డ్ ఎయిర్ పోర్టు.?
ఆంధ్రప్రదేశ్‌లో 6 ఎయిర్‌పోర్టుల ఫీజిబిలిటీపై సర్వే మొదలుపెట్టారు. అందులో శ్రీకాకుళం జిల్లాలో 1383 ఎకరాల భూమి అందుబాటులో ఉన్నట్లు ప్రభుత్వానికి నివేదిక అందింది. అక్కడ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. శ్రీకాకుళం జిల్లాతో పాటు మరో 5చోట్ల ఫీల్డ్ ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేసేందుకు అవసరమైన అధ్యయనం చేయడానికి రూ.2.27 కోట్లు విడుదల చేయనున్నారు.
News November 13, 2024
శ్రీకాకుళం: ఇంటర్ పరీక్షల ఫీజు గడువు పెంపు
ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే రెగ్యులర్, ప్రైవేట్ విద్యార్థుల పరీక్ష ఫీజుల చెల్లింపు గడువు పెరిగింది. ఈనెల 21 వరకు గడువు పొడిగించినట్లు RIO ప్రగడ దుర్గారావు తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.