News July 9, 2024
శ్రీకాకుళంలో TODAY TOP HEADLINES

✒ నాగావళి రివర్ ఫ్రంట్ అభివృద్ధికి కలెక్టర్ ప్రణాళికలు
✒ కళింగ వైశ్య మాజీ అధ్యక్షుడు జగన్మోహన్ రావు మృతి
✒ దళితులకు భూహక్కు పత్రాలు అందజేయాలి
✒ మందస మండలంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం
✒ కోడి రామ్మూర్తి స్టేడియం పునః నిర్మాణ పనులకు ప్రభుత్వం ఆమోదం
✒ హిరమండలంలో వలకు చిక్కిన కొండచిలువ
✒ మందసలో 1500 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం
✒ భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులపై రామ్మోహన్ సమీక్ష
Similar News
News December 24, 2025
ఆమదాలవలస : క్రిస్మస్ సోదరులకు వినూత్న రీతిలో శుభాకాంక్షలు

క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ సందర్భంగా సైకత శిల్పి గేదెల హరికృష్ణ బుధవారం చేసిన సైకత శిల్పం ఆకట్టుకుంటుంది. ఆమదాలవలస మండలం సంగమేశ్వర స్వామి ఆలయం సమీపంలో ఈ సైకత శిల్పాన్ని అందంగా తీర్చిదిద్దారు. ఇసుకతో జీసస్ ప్రతిరూపాన్ని తయారుచేసి క్రిస్మస్ శుభాకాంక్షలు వినూత్న రీతిలో తెలియజేశారు. ఈ శిల్పాన్ని పలువురు చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
News December 24, 2025
శ్రీకాకుళం: రైల్వే ట్రాక్ దాటుతుండగా వ్యక్తి దుర్మరణం

శ్రీకాకుళం GRP పరిధి నెల్లిమర్ల- విజయనగరం మధ్యలో రైల్వే ట్రాక్‌పై బుధవారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు ఎస్ఐ మధుసూదన్ రావు తెలిపారు. తిరుచునాపల్లి నుంచి హౌరా వెళ్లే రైలు వస్తున్న సమయంలో రైల్వే ట్రాక్‌ను దాటుతుండడంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు. మృతదేహాన్ని విజయనగరం మహారాజా ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచినట్లు తెలిపారు. చనిపోయిన వ్యక్తికి సుమారు 35 ఏళ్ల వయస్సు ఉంటుందన్నారు.
News December 24, 2025
అర్జీదారుల సమస్యలు పరిష్కరించాలి: మంత్రి అచ్చెన్న

అర్జీదారుల సమస్యలు పరిష్కరించాలని మంత్రి కింజరాపు అచ్చెన్న అధికారులను ఆదేశించారు. కోటబొమ్మాళి మండలం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో బుధవారం గ్రీవెన్స్ నిర్వహించారు. గ్రీవెన్స్‌కు వచ్చిన అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. ఫిర్యాదుదారుడు చేసిన అంశాలను జాగ్రత్తగా పరిశీలించి, పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.


