News September 19, 2024
శ్రీకాకుళంలో TODAY TOP HIGHLIGHTS

✮ శ్రీకాకుళంలో ప్రైవేటు సంస్థ 3వేల మందికి మోసం
✮ రేగిడిలో ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
✮ ఏపీ పీజీ సెట్ రెండో విడత కౌన్సిలింగ్ ప్రారంభం
✮ జిల్లాలో 95.45 శాతం ఈ క్రాప్ నమోదు
✮ శ్రీకాకుళం IIIT రిజిస్ట్రార్గా అమరేంద్ర
✮ త్వరలో ఆమదాలవలస అన్న క్యాంటీన్ ప్రారంభం
✮ ఈనెల 20న ప్రతిభావంతుల ప్రత్యేక గ్రీవెన్స్
✮ DRBRAUలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అందని వేతనాలు
✮ జిల్లా ప్రముఖ విద్యావేత్త చక్రధర్ మృతి
Similar News
News October 27, 2025
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కుమారుడి పేరు ఇదే..!

కేంద్ర పౌర విమానాయన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కుమారుడికి నామకరణం మహోత్సవం ఢిల్లీలో ఆదివారం నిర్వహించారు. రామ్మోహన్ కుమారుడికి శివన్ ఎర్రం నాయుడు అని నామకరణం చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు కేంద్ర మంత్రులు, జీఎంఆర్ సంస్థల అధినేత, శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్యేలు హాజరయ్యారు. రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చం నాయుడు, ఎర్రం నాయుడు సోదరులు, కింజరాపు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
News October 27, 2025
ఎచ్చెర్ల: డా.బీ.ఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయానికి సెలవులు

ఎచ్చెర్లలోని డా.బీ.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీకి సోమ, మంగళవారం సెలవులు ప్రకటించారు. తుపాన్ నేపథ్యంలో ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు యూనివర్సిటీకి సెలవులు ప్రకటించినట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ డా.బి.అడ్డయ్య వివరించారు. యూనివర్సిటీ అనుబంధ డిగ్రీ కళాశాలలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు, అధ్యాపక సిబ్బంది భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
News October 27, 2025
ప్రాణ నష్టం 0 లక్ష్యంగా అధికారులు పనిచేయాలి: స్పెషల్ ఆఫీసర్

ప్రాణ నష్టం 0 లక్ష్యంగా పనిచేయాలని, అత్యవసర పరిస్థితుల్లో గోల్డెన్ అవర్ను ఏ అధికారి వృథా చేయకుండా పనిచేయాలని శ్రీకాకుళం జిల్లా ప్రత్యేక అధికారి KVN చక్రధరబాబు అధికారులను ఆదేశించారు. ఆదివారం శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో ఎస్పీ, ఇన్ఛార్జ్ కలెక్టర్, అధికారులతో సమావేశం నిర్వహించారు. మెంథా తుపాను ఈనెల 28న తీరం దాటే అవకాశం ఉందన్నారు. ప్రతి అధికారి ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.


