News March 18, 2025
శ్రీకాకుళం: అంగన్వాడీ కేంద్రాల పనివేళలు ఇవే..

అంగన్వాడీ కేంద్రాలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటాయని మహిళా శిశు సంక్షేమ శాఖ పథక సంచాలకులు బి. శాంతి శ్రీ మంగళవారం తెలిపారు. వేసవి దృష్ట్యా మార్చి నెల 18వ తేదీ నుంచి మే నెల 31వ తేదీ వరకు అంగన్వాడీ కేంద్రాలు సమయం మార్చినట్లు పేర్కొన్నారు. ప్రీ స్కూల్ పిల్లలకు వేడి ఆహారం ఇచ్చి పిల్లలను వారి వారి గృహాలకు పంపాలని ఆమె తెలిపారు.
Similar News
News October 19, 2025
సిక్కోలులో శైవక్షేత్రాలు ఇవే..!

దీపావళి తర్వాత కార్తీకమాసం ప్రారంభం కానుంది. చాలామంది శైవక్షేత్రాలను దర్శించి దీపారాధన చేస్తుంటారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని రావివలస ఎండల మల్లిఖార్జునస్వామి దేవస్థానం, శ్రీముఖలింగం- ముఖలింగేశ్వరస్వామి, పలాస-స్వయంభూలింగేశ్వరస్వామి, పాతపట్నం-నీలకంటేశ్వరస్వామి, శ్రీకాకుళంలోని ఉమారుద్ర కోటేశ్వరస్వామి ఆలయాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 21 నుంచి కార్తీకమాస పూజలు చేయనున్నారు.
News October 19, 2025
ప్రేమికుల వివాదంలో కూన పేరు.. ఖండించిన MLA

ఆముదాలవలస MLA కూన రవికుమార్‌పై ఓ మహిళ తీవ్ర ఆరోపణలు చేసింది. ‘మా అమ్మాయిని ఓ యువకుడు ఐదేళ్లు ప్రేమించాడు. పెళ్లికి ఒప్పుకొని ఇప్పుడు చేసుకోనంటున్నాడు. వాళ్ల వెనుక ఎమ్మెల్యే కూన ఉన్నారంటూ యువకుడు బెదిరిస్తున్నాడు. పోలీసులు కూడా పట్టించుకోవడం లేదు’ అని ఆమె వాపోయింది. కొన్ని పత్రికలు, టీవీ ఛానళ్లు తనపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆ ఆరోపణలను MLA ఖండించారు.
News October 19, 2025
శ్రీకాకుళం: ఇంటికొస్తూ యువకుడి మృతి

దీపావళి కోసం ఇంటికొస్తూ ఓ వ్యక్తి చనిపోయిన విషాద ఘటన ఇది. ఇచ్ఛాపురం(M) లొద్దపుట్టికి చెందిన వసంత్ కుమార్(32), బెల్లుపడ అచ్చమ్మపేటకు చెందిన సంధ్యకు మార్చిలో పెళ్లి జరిగింది. వసంత్ కుమార్ విజయవాడలో పనిచేస్తూ అక్కడే కాపురం పెట్టాడు. దీపావళి కోసం బైకుపై ఇద్దరూ స్వగ్రామానికి శనివారం బయల్దేరారు. ప్రత్తిపాడు మండలం ధర్మవరం వద్ద హైవేపై ఆగిఉన్న లారీని ఢీకొట్టారు. భర్త చనిపోగా భార్య తీవ్రంగా గాయపడింది.