News March 25, 2024

శ్రీకాకుళం: అక్కడ ఒకరోజు తర్వాత హోలీ 

image

పర్లాకిమిడి గజపతి రాజులుచే నిర్మించిన లివిరి గోపీనాధస్వామి ఆలయంలో ఒడిశా సంప్రదాయం ప్రకారం మంగళవారం హోలీ జరుపుకుంటారు. తిరువీధి, వంశధార నదిలో చక్రతీర్థ స్నానాలు నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. గోపినాధస్వామి హోలీ ఉత్సవానికి ఆంధ్రా, ఒడిశా నుంచి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటారు. ఈ ఉత్సవంలో పర్లాకిమిడి మహారాజు వంశీయులు పాల్గొనడం ఆనవాయితీగా వస్తుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. 

Similar News

News January 20, 2026

ఏప్రిల్ 20న సింహాచలం చందనోత్సవం

image

సింహాచలంలో ఏప్రిల్ 20న జరగనున్న లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం ఏర్పాట్లపై ప్రాథమిక సమీక్ష జరిగింది. జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మంగళవారం విశాఖ కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. గత అనుభవాల దృష్ట్యా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. కలెక్టర్ హరేంధిర ప్రసాద్, జేసీ, సీపీ, జీవీఎంసీ కమిషనర్, దేవస్థానం ఈవో ఉన్నారు.

News January 20, 2026

SKLM: స్వర్ణంతో బియ్యపు గింజంత రథసప్తమి లోగో

image

రథసప్తమి ఉత్సవాలను పురస్కరించుకుని ఉదయించే సూర్యుడుని స్వర్ణంపై ఆవిష్కరించారు పలాస (M) కాశీబుగ్గకు చెందిన సూక్ష్మ కళాకారుడు కొత్తపల్లి రమేష్ ఆచారి. రథసప్తమి అనే అక్షరాలను ఇందులో పొందిపరిచి ఆకట్టుకుంటున్నారు. ఈ లోగోను ఆదిత్యునికి బహుమతిగా ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఈ లోగో 100 మిల్లీ గ్రాముల బంగారం రేకుపై 5 గంటలు శ్రమించి తయారు చేసినట్లు ఆయన వెల్లడించారు.

News January 20, 2026

శ్రీకాకుళం: పక్షి ఈకపై ఆదిత్యుడి చిత్రం

image

శ్రీకాకుళంలోని జిల్లాకు చెందిన ప్రముఖ సూక్ష్మకళా చిత్రకారుడు వాడాడ రాహూల్ పక్షి ఈకపై ఆరోగ్య భాస్కరుడు సూర్యనారాయణ స్వామి చిత్రాన్ని గీశారు. రథసప్తమి పండుగ సందర్భంగా రథంపై ఆదిత్యుని చిత్రం గీసినట్లు వెల్లడించారు. సూర్యుడి రథాన్ని లాగే ఏడు గుర్రాలలో ఒకదానికి అంకితం చేస్తూ ఈ చిత్రాన్ని గీశామన్నారు. ఇది చూపురాలను ఆకట్టుకుంటోంది.