News October 6, 2024

శ్రీకాకుళం: అక్ర‌మంగా ఇసుక‌ ర‌వాణా చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు: ఎస్పీ

image

శ్రీకాకుళం జిల్లాలో ఎక్క‌డైనా అక్ర‌మంగా ఇసుక త‌వ్వ‌కాలు జ‌రిపినా, అక్ర‌మంగా ఇసుక‌ను ర‌వాణా చేసి క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామని హెచ్చరించారు.. వీరికి భారీగా జ‌రిమానా విధించ‌డంతోపాటు, కేసులు కూడా న‌మోదు చేస్తామ‌న్నారు. ఇప్పటి వరకు అక్రమార్కులపై రూ.5.75 లక్షలు జరిమానా కూడా విధించామని, పోలీస్‌, రెవెన్యూ, మైనింగ్ అధికారుల‌తో జిల్లా స్థాయి టాస్క్‌పోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

Similar News

News September 16, 2025

శ్రీకాకుళం ఎస్పీ గ్రీవెన్స్‌కు 55 అర్జీలు

image

పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలు పునరావృతమవకుండా పూర్తి స్థాయిలో విచారణ చేసి శాశ్వత పరిష్కారం చూపాలని పోలీసు అధికారులను ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి ఆదేశించారు. సోమవారం జిల్లా SP కార్యాలయంలో ఎస్పీ గ్రీవెన్స్ నిర్వహించారు. అర్జీల్లో పౌర సంబంధాలు, కుటుంబ, ఆస్తి గొడవలు, మోసపూరితమైనవి ఇతరత్రా అంశాలపై మొత్తం 55 ఫిర్యాదులు వచ్చాయని ఎస్పీ వెల్లడించారు.

News September 16, 2025

శ్రీకాకుళం జిల్లాలో టుడే టాప్ న్యూస్ ఇవే..!

image

➤పలాస: సమస్యల పరిష్కారానికి రోడ్డెక్కిన ఉపాధ్యాయులు.
➤మందస: బలవంతపు భూ సేకరణ ఆపాలి
➤సీఎం సమీక్ష సమావేశంలో సిక్కోలు మంత్రి, కలెక్టర్
➤టెక్కలి: మెరుగైన సేవలకు మరో భవనం కట్టాల్సిందే
➤బూర్జ: పాఠశాలకు తాళం వేసి విద్యార్థులు, తల్లిదండ్రులు నిరసన
➤ఎల్.ఎన్ పేట: నిలిచిన నిర్మాణం.. రాకపోకలకు అంతరాయం
➤రాజమండ్రిలో రైలెక్కిన బాలుడిని పలాసలో రక్షించిన పోలీసులు

News September 15, 2025

శ్రీకాకుళం-విశాఖకు ఈ రైళ్లు నడవనున్నాయి

image

శ్రీకాకుళం జిల్లా వాసులకు రైల్వే శాఖ శుభవార్త తెలిపింది. విశాఖ-బ్రహ్మపూర్-విశాఖపట్నం(18525/26) రైలును ఇటీవల రద్దు చేసిన విషయం తెలిసిందే. మరలా సేవలను పునరుద్ధరించినట్లు తాజాగా వెల్లడించింది. పలాస-విశాఖ(67290) మెము రైలును విశాఖ వరకు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఇవి శ్రీకాకుళం రోడ్డు, పొందూరు, నౌపడ, పలాస, సోంపేట, ఇచ్ఛాపురం తదితర స్టేషన్లు మీదుగా నడవనున్నాయి.