News August 30, 2024
శ్రీకాకుళం: అదనపు ఎరువుల కోసం ఆదేశాలు జారీ

ఇటీవల శ్రీకాకుళం జిల్లా జడ్పీ సమావేశ మందిరంలో ప్రజా ప్రతినిధులు అధికారుల సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు ఎరువుల కొరత అంశాన్ని ప్రస్తావించడంతో స్పందించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మార్క్ ఫెడ్ ఉన్నాతధికారులను గురువారం ఆదేశించారు. జిల్లాకు 820 టన్నుల డిఏపి, 760 టన్నుల యూరియా సరఫరాకు చర్యలు చేపట్టారు. శుక్రవారం నుంచే రైతులకు పంపిణీ చేయాలన్నారు.
Similar News
News February 16, 2025
శ్రీకాకుళం: రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత

శ్రీకాకుళం నగరంలోని ఏపీ.ఎస్.ఆర్టీసీ డిపో 1 లో శనివారం రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ప్రజా రవాణా అధికారి ఏ. విజయకుమార్, డీఎస్పీ వివేకానంద పాల్గొని మాట్లాడారు. రోడ్డు భద్రతా ప్రతీ ఒక్కరి బాధ్యత అని అన్నారు. అనంతరం శ్రీకాకుళం,టెక్కలి, పలాస డిపోలో ఎక్కువ కాలం ప్రమాద రహిత డ్రైవర్స్‌గా ప్రతిభ కనపరిచిన వారికి ప్రశంసా పత్రాలు, నగదు బహుమతులు అందజేశారు.
News February 15, 2025
పలాస : రైలులో గుర్తుతెలియని వ్యక్తి మృతి

తిరుపతి – పూరి ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో శనివారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు పలాస జీఆర్పీ ఎస్ఐ ఎస్కే షరీఫ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మృతదేహాన్ని ఎవరైనా గుర్తించినట్లయితే 9440627567 నంబరుకు సంప్రదించాలన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించామన్నారు.
News February 15, 2025
రణస్థలం : ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న జేసీ

రణస్థలం మండలం పైడి భీమవరం ఇసుక తనిఖీ కేంద్రం వద్ద 28 లారీలను జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్ శుక్రవారం రాత్రి తనిఖీ చేశారు. అందులో 12 లారీలు నకిలీ బిల్లులతో రవాణా అవుతున్నట్లు గుర్తించారు. దీంతో వెంటనే ఆయా లారీలను సీజ్ చేయాలని జేసీ ఆదేశించారు. అనంతరం వాటిని మైన్స్ అండ్ విజిలెన్స్ అధికారులకు అప్పగించారు. ఈ తనిఖీలో తహశీల్దార్ ఎన్ ప్రసాద్, ఎస్సై చిరంజీవి, విజిలెన్స్ అధికారులు పాల్గొన్నారు.