News May 22, 2024
శ్రీకాకుళం: అధ్యాపకులకు ముఖ్య గమనిక

కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఉత్తమ అధ్యాపకులకు ఇచ్చే అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. UG, PG విద్యార్థులకు బోధించే అధ్యాపకులకు 2 కేటగిరీలలో ఇచ్చే ఈ అవార్డులకు https://www.awards.gov.in/ అధికారిక వెబ్సైట్లో జూన్ 20లోపు దరఖాస్తు చేసుకోవాలని కేంద్రం సూచించింది. ఎంపికైన 35 మంది అధ్యాపకులకు మెడల్, సర్టిఫికెట్తో పాటు రూ.50వేల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు కేంద్రం తెలిపింది.
Similar News
News December 1, 2025
టెక్కలి: డయేరియా ఘటనపై CM ఆరా.!

టెక్కలి జిల్లా ఆసుపత్రిలో డయేరియా కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. CM చంద్రబాబు సోమవారం సంతబొమ్మాళి మండలం తాళ్లవలసలో ప్రబలుతున్న డయేరియాపై ఆరోగ్యశాఖ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. గ్రామంలో డయేరియా ప్రబలడానికి గల కారణాలను పూర్తిస్థాయిలో పరిశీలించాలన్నారు. తాగునీటిని పరీక్షించాలని ప్రజలకు అవసరమైన వైద్య సేవలను అందించాలని అధికారులను ఆదేశించారు. సమీప గ్రామాలను సైతం అప్రమత్తం చేయాలన్నారు.
News December 1, 2025
రైతులు అప్రమత్తంగా ఉండాలి: శ్రీకాకుళం కలెక్టర్

దిత్వా తుఫాను సందర్భంగా రైతులు తమ పంటలపట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని కొన్ని మండలాల్లో అక్కడక్కడ వర్షాలు పడుతున్నట్లు చెప్పారు. జిల్లాకు దిత్వా తుఫాను ప్రభావం లేనప్పటికీ జిల్లా రైతులు తమ పంటల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.